NewsOrbit
Featured జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona : ఇదేం ద‌రిద్రం… క‌రోనా పెరుగుతుంటే ఇలాంటి రాజ‌కీయాలా?

corona cases increasing in india

Corona : క‌రోనా… ఇప్పుడు అంద‌ర్నీ క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశం. క‌రోనా సెకండ్‌వేవ్ ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది. ఫ‌స్ట్ వేవ్ రికార్డుల‌ను అన్నింటిని తుడిపెట్టే విధంగా కోవిడ్ విజృంభిస్తోంది. దీంతో మునుపెన్నుడూ లేని విధంగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే, దీని కేంద్రంగా రాజ‌కీయ విమ‌ర్శ‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వంపై క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ కేంద్రంగా మ‌హారాష్ట్రలో అధికారంలో ఉన్న శివ‌సేన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

corona cases increasing in india
శివ‌సేన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

శివ‌సేన పార్టీ ప‌త్రిక సామ్నా త‌న సంపాద‌కీయంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల క‌మిష‌నే కోవిడ్ సెకండ్ వేవ్‌కు బాధ్య‌త వ‌హించాల‌ని శివ‌సేన డిమాండ్ చేసింది. ముఖ్యంగా.. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల నుంచే కోవిడ్ కేసులు ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపించాయ‌ని విరుచుకుప‌డింది. మ‌రోవైపు.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఢిల్లీ పాల‌కులు మ‌హ‌మ్మారి వ్యాప్తి చేస్తున్నార‌ని ఆరోపించిన ఆ పార్టీ.. దేశంలో ప‌లు ఆస్ప‌త్రుల్లో బెడ్లు, ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్ల కొర‌త‌తో పాటు మందులు కూడా ల‌భించ‌ని ప‌రిస్థితి ఉంటే.. కేంద్ర మాత్రం.. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల‌తో బిజీగా ఉంద‌ని ఎద్దేవా చేసింది. ఇప్ప‌టికైనా రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌హ‌మ్మారి క‌ట్ట‌డిపై కేంద్ర స‌ర్కార్ దృష్టిసారించాల‌న్న శివ‌సేన‌.. సెకండ్ వేవ్ కు మాత్రం కేంద్రం, ఈసీల తీరే కార‌ణ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఆ సీఎం కూడా …

తాజాగా ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ తాజాగా ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు. కోవిడ్ వ్యాక్సిన్ల‌ను ప్ర‌భుత్వ ఆధీనంలోనే కాకుండా.. బ‌హిరంగ మార్కెట్లో కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాల‌ని కోరారు. దీంతో కోవిడ్ టీకాలు కావాల‌నుకున్న వారు కొనుగోలు చేసుకుంటార‌ని దీని మూలంగా.. ఆస్ప‌త్రుల‌కు వ‌చ్చేవారి సంఖ్య త‌గ్గిపోయి.. అణ‌గారిన వ‌ర్గాల‌పై ఎక్క‌వ ఫోక‌స్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన క‌రోనా టీకాల‌ను అంద‌రికీ అంద‌బాటులోకి తేవ‌డం కోసం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని లేఖ‌లో ప్ర‌ధానిని కోరారు సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్.. ఇక‌, వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని పెంచేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆయా కంపెనీల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు.

author avatar
sridhar

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !