తెలంగాణ ఎన్నికల్లో నోటాకూ చోటు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. హోరాహోరీ పోరు జరిగిందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. మొత్తం 119 స్థనాలకు గాను తెరాస 87 స్థానాలలో విజయం సాధించింది. కూటమి కేవలం 21 స్థానాలకే పరిమితమైంది. ఎంఐఎం 7 స్థానాలలోనూ, బీజేపీ 1 స్థానంలోనూ విజయం సాధించాయి. ఇండిపెండెంట్లు 3 చోట్ల గెలిచారు. కాగా ఈ ఎన్నికలలో నోటాకూ కూడా తెలంగాణ ఓటర్లు చోటిచ్చారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ నోటాకూ ఓట్లు పడ్డాయి. అత్యధిక స్థానాలలో నోటా స్కోరు వెయ్యి దాటింది.