శ్రీనగర్ : ఘోరప్రమాదం 23 మంది మృతి

జమ్మూ కాశ్మీర్ లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో అరడజను మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంఛ్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. లోరన్ నుంచి పూంఛ్ వెళుతుతన్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది.సహాయక కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. పేర్లా ప్రాంతంలో బస్సు లోయలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారని చెబుతున్నారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.