హైదరాబాద్ : చంద్రబాబుతో కూటమి నేతలు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ప్రజాకూటమి నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రచారం చివరి రోజున అనుసరించాల్సిన వ్యూహం, పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రంలోని నియోజకవర్గాలలో తాజా పరిస్థితులపై చర్చించారు.