NewsOrbit
జాతీయం న్యూస్

ఎయిర్ ఇండియాకు డీజీసీఏ బిగ్ షాక్ ..రూ.30లక్షల జరిమానా

ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బిగ్ షాక్ ఇచ్చింది. రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు విమాన పైలెట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటనలో నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీసీఏ ఈ చర్యలు చేపట్టింది. తన విధులను సక్రమంగా నిర్వహించనందుకు గానూ ఏయిర్ ఇండియా ఇన్ ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్ కు మూడు లక్షల జరిమానాను విధించింది డీజీసీఏ.

Air India Fined Rs30 Lakhs Pilots Licence Suspended For Three Months

 

మరో పక్క ఈ ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రను నాలుగు నెలల పాటు విమానంలో ప్రయాణించకుండా నిషేదం విధించింది. అయితే డీజీసీఏ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని నిందితుడి తరపు న్యాయవాదులు తప్పుబట్టారు. అంతర్గత విచారణ కమిటీని తాము గౌరవిస్తామనీ కానీ ఆ కమిటీ సూచించిన కారణాలతో తాము విభేదిస్తామని చెప్పారు. 9ఏ లో కూర్చున్న వ్యక్తి 9 సీలో కూర్చున్న ప్రయాణీకురాలిపై ఎలా మూత్ర విసర్జన చేశాడన్న దానిపై కమిటీ సరైన వివరణ ఇవ్వలేదని తెలిపారు. కమిటీ నిర్ణయంపై తాము అప్పీల్ చేశామనీ, తమకు దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని పేర్కొన్నారు.

గత సంవత్సరం నవంబర్ 26న న్యూయార్క్ నుండి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్ లో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్ర అనే వ్యక్తి మూత విసర్జన చేశారని బాధితురాలు విమాన సిబ్బందికి తొలుత ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె న్యాయం కోసం ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కు ఆమె లేఖ రాశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడు శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కేసు లో విచారణ నిమిత్తం నిందితుడుని మూడు రోజుల కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరగా, డిల్లీ పోలీసుల వినతిని న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం అతనికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు పంపింది.

సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ కు దక్కని ఊరట .. జీవో నెం.1పై విచారణలో సుప్రీం కోర్టు ఏమన్నదంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju