32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
దైవం న్యూస్

Shani Aamavasya 2023: మౌనీ ఆమావాస్య లేదా శని అమావాస్య అంటే ఎమిటి.. ఆ రోజు ఏమి చేయాలంటే..?

Share

Shani Aamavasya 2023:  హిందువులలో ఎక్కువ మంది ఏదైనా మంచి పనులు చేయాలంటే తిధులు, వార నక్షత్రాలను చూసుకుంటారు. అమావాస్య అంటే ఒక భయం. ఆ రోజు ఏ పనికి మంచిది కాదనే భావన.హిందువులకు అమావాస్య అంటే ఒక అపనమ్మకం ఉంటుంది. అంతే కాకుండా ఈ రోజు ఏ పనిగానీ, శుభకార్యం గానీ చేయకూడదు అని భావిస్తుంటారు. ఈ సారి అమావాస్య జనవరి 21న (రేపు) వస్తుంది. పైగా ఈ రోజు శనివారం కావడంతో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అమావాస్యను శనిశ్చరి అమావాస్య లేదా శని అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తారు. అంతే కాకుండా ఇదే రోజు 30 ఏళ్ల తర్వాత శనీశ్వురుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. అంతే కాకుండా ఇదే రోజు అరుదైన నాలుగు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ రోజుకు మరింత విశిష్టత ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు.

Shani Amavasya 2023

 

శని అమావాస్య రోజున స్నానదానాలకు అత్యంత ప్రాధాన్యత, మహత్యముందని చెబుతుంటారు. ఈ రోజున సర్వార్ధ సిద్ధ యోగ సంయోగం ఏర్పడనుందనీ, ఇది శని అమావాస్య మహత్యాన్ని రెండింతలు పెంచుతుందని పేర్కొంటారు. ఈ రోజున ఏ విధమైన ఉపాయాలు ఆచరిస్తే శని కటాక్షం కలుగుతుంది అనేది తెలుసుకుందాం.

Shani Amavasya 2023

మౌన వ్రతం పాటించి దానాలు చేయాలి

మౌనీ అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానానికి విశేష మహత్యం ఉంది.  నదిలో స్నానం చేస్తే మంచి లాభాలుంటాయని భావిస్తుంటారు. కుండలిలో ఏదైనా దోషం కష్టాలకు కారణమవుతుంటే వారు మౌనీ ఆమావాస్య నాడు ప్రత్యేకంగా శని సంబంధిత ఉపాయాలు ఆచరించాలి. శని అమావాస్య నాడు ఎవరైనా పేద వాడికి లేదా ఆపన్నుడికి వస్త్ర దానం లేదా ధాన్యం వంటివి దానం చేయడం వల్ల ఆ వ్యక్తి  జీవితంలో వచ్చే కష్టాలు తొలగిపోతాయనే నమ్మిక. మౌనీ అమావాస్య నాడు పూజాది కార్యక్రమాలతో పాటు వ్రతం కూడా ఆచరిస్తే మంచిది. ఈ రోజున విష్ణు భగవానుడిని పూజించడం వల్ల ప్రత్యేక లాభాలుంటాయని జోతిష్య పండితులు చెబుతుంటారు. ఈ రోజున మౌన వ్రతం పాటిస్తూ దానాలు చేయడం వల్ల దుఖం దరిద్రం, కాలసర్పం, పితృదోషం నుంచి విముక్తి కలుగుతుందని జోతిష్య పండితులు చెబుతుంటారు.

శని అమావాస్య పూజా విధానం, శుభ యోగాలు

వేద పంచాంగం ప్రకారం, ఈ సారి అమావాస్య జనవరి 21 (రేపు) ఉదయం 6.16 గంటలకు ప్రారంభమై.. జనవరి 22 (ఎల్లుండి) తెల్లవారుజామున 2.21 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం జనవరి 21న అమావాస్య జరుపుకుంటారు. దీనితో పాటు శనీశ్వరుడిని ఆరాధించే శుభ సమయం సాయంత్రం 6 నుండి 7.30 వరకు ఉంటుంది. అమావాస్య రోజు సాయంత్రం శని దేవాలయానికి గానీ లేదా ఆలయాల్లో నవగ్రహ మండపం వద్దకు వెళ్లి శని విగ్రహం ముందు ఆవనూనె దీపం వెలిగిస్తే మంచిది. దీనితో పాటు శని చాలీసా మరియు శనిదేవుని బీజ్ మంత్రాన్ని జపించాలి. అంతే కాకుండా నల్ల దుప్పటి, నల్ల బూట్లు, నల్ల నువ్వులు దానం చేయండి. శని సాడే సతి లేదా ధైయాతో బాధపడే వారు ఈరోజున రావిచెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించి శనీశ్వరుడిని ఆవనూనెతో అభిషేకించాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుండి విముక్తి పొందవచ్చని జోతిష్య పండితులు చెబుతుంటారు.

Shani Gochar 2023: కుంభ రాశిలో ఆరంభమైన శని సంచారం .. ఈ నాలుగు నాలుగు రాశుల వారికి ఇబ్బందులే ఉండవు


Share

Related posts

బిగ్ బాస్ 4 : మోనాల్ టాప్-5 లో కి వెళ్లడానికి పాపం అఖిల్ ఏం చేసాడో చూడండి..!

arun kanna

ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చిన రోజే ఏపీ ప్ర‌జ‌ల‌ను బాధ పెట్టిన జ‌గ‌న్ ?

sridhar

Anupama Parameswaran Gorgeous Photos

Gallery Desk