Bheemla nayak: ‘భీమ్లా నాయక్’ నుంచి మరో సర్‌ప్రైజ్..ఇది మరో లెవల్ అంటున్న మేకర్స్

Share

Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. సినిమా రిలీజ్‌కు ముందే రికార్డుల వేట మొదలవుతుంది. అలా మొదలైన సినిమానే భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ ఏకంగా పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాను అలాగే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాను ఢీకొనబోతోంది. ఇప్పటికే చాలావరకు ఆర్ఆర్ఆర్ మూవీ దర్శక, నిర్మాతలు భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ చేసుకోమని చాలా ట్రై చేశారు.

another surprise from bheemla-nayak
another surprise from bheemla-nayak

కానీ మేకర్స్ ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతి బరిలో దింపాల్సిందే అంటూ పట్టుదలతో రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా నుంచి వచ్చిన ఒక్కో అప్‌డేట్ అంచనాలు అమాంతం పెంచుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ సృష్ఠిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి మరో సాంగ్ సునామీని సృష్ఠించేందుకు రాబోతోందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది పవర్ స్టార్ పాడిన పాట అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే థమన్ ఇచ్చిన ట్యూన్స్‌కు స్పీకర్ బాక్సులు బద్దలవుతున్నాయి.

Bheemla nayak: పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు మొదలయ్యాయి.

అలాంటి మరో సాంగ్ అది కూడా పవన్ పాడింది రాబోతుందనగానే ఇక పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ వస్తుందా అని కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. అయితే, ఈ సాంగ్ డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కామెడి కింగ్ లెజెండ్ బ్రహ్మానందం మంచి రోల్ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు సాగర్ కె చంద్ర. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్.


Share

Related posts

Big Breaking: వైఎస్ షర్మిల అరెస్టు..! బేగంపేట పీఎస్ కు తరలింపు..! ఎందుకంటే..?

somaraju sharma

ఊరువాడ కరోనా భయం మరో విధంగా కూడా..!

somaraju sharma

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ పై ప్రదీప్ చేసిన కామెంట్స్ వైరల్…!

arun kanna