అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యేందుకు మూడు రోజుల ముందే అతనికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. తన ఇంటిలో మెడికల్ లీవ్ కింద రెస్ట్ చేసుకుంటున్న అచ్చెన్నాయుడు ని ఏసీబీ అధికారులు హుటాహుటిన తెల్లవారుజామునే అరెస్టు చేశారు. అయితే అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు అతనికి ఆరోగ్యం బాగా లేదని కూడా మందులు తీసుకుని వెళ్లేందుకు కూడా ఏసీబీ అధికారులు అనుమతించలేదని మీడియా వారి ముందు తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత అచ్చెన్నాయుడు ని గుంటూరు జిజిహెచ్ లో ఉంచి విచారణ జరుగుతుండగా అతనికి అవసరమైన చికిత్స వైద్యం కూడా అందజేస్తున్నారు అని రిపోర్టులు వచ్చాయి. అయితే ప్రస్తుతం తాజాగా గుంటూరు జిజిహెచ్ పరిధిలో కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. అచ్చెన్నాయుడుకి సమయానికి అవసరమైన మందులు అందిస్తున్నా కూడా అతని ఆరోగ్య పరిస్థితి కొద్దిగా క్షీణించిందట. దీంతో అతనికి మందులతో నయం అవుతుందా లేదా మరొక చిన్న సర్జరీ అవసరం పడుతుందా అన్న సందిగ్ధత లో జైలు అధికారులు ఉన్నారని పలువురు చెబుతున్నారు.
ఇక పోతే నిన్న చంద్రబాబు అచ్చెన్నాయుడు ని కలిసేందుకు వెళ్లగా జైలు అధికారులు మరియు సూపరింటెండెంట్ దానికి నిరాకరించడం వెనుక ఉన్న కారణం కూడా ఇదే అయి ఉంటుందని టీడీపీ వర్గాలు బలంగా భావిస్తున్నారు. మరి అతని పరిస్థితి ఒక్కసారిగా విషమమైతే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన కలకలం రేగడం అనివార్యం అవుతుంది.