BLACK RICE: అన్నం అనగానే అందరికీ గుర్తొచ్చేది తెల్లబియ్యమే. వైట్ రైస్‌ను ఫుడ్ ఐటమ్ గా వండుకుని తినడం కామన్. కాగా, రైస్ లోనూ పలు రకాలుంటాయని చాలా మందికి తెలిసి ఉండదు. నల్లబియ్యం, బ్రైన్ కలర్ రైస్ ఇలా పలు రకాలున్నాయి. ఇందులో బ్లాక్ రైస్ వల్ల హెల్త్‌కు చాలా ప్రయోజనాలున్నాయని పెద్దలు చెప్తున్నారు. ఈ బ్లాక్ రైస్ వల్ల అనారోగ్య సమస్యలకు ఇట్టే చెక్ పెట్టొచ్చట. ఇందులో యాంటీ అక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇకపోతే వెయిట్ లాస్ కావాలనుకునే వారు ఈ నల్లబియ్యం వాడితే చాలా మంచిది.
VIRAL: బికినీతో విమానాశ్రయానికి వచ్చిన మహిళ.. ఎక్కడంటే?
ఈ బ్లాక్ రైస్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. అయితే.., ఫైబర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ బ్లాక్ రైస్ తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కూడా ఉండదు. కంటి ఆరోగ్యాన్ని పెంపొందించేందుకూ బ్లాక్ రైస్ ఉపయోగపడతాయి. రెటినాల్ డామేజ్ జరగకుండా బ్లాక్ రైస్ లో ఉండే విటమిన్స్ కాపాడుతాయి. నల్లబియ్యంలో ఉండే ఫైబర్ వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలు తలెత్తవు. జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆస్తమా ఉన్న వారు ఈ నల్లబియ్యాన్ని ప్రతీరోజు ఆహారంలో భాగం చేసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయి.
PC Mustafa : ఆ ఇడ్లీ పిండి కంపెనీ వెనుక ఇంతా కధ ఉందా …?
నల్లబియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే క్రమంగా ఆస్తమా తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. డయాబెటిస్ కూడా తగ్గుతుందట. ఈ నల్లబియ్యంలో ఉండే ఫైబర్ వల్ల ఫుడ్ జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ కూడా నార్మల్ కు వచ్చేస్తాయి.
BIRYANI: మూలుగు బొక్క బిర్యానీ గురించి మీకు తెలుసా …?
ఇక ఇన్సూలిన్ లెవల్స్ ను కూడా ఈ బ్లాక్ రైస్ కంట్రోల్ చేస్తాయి. మొత్తంగా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో బ్లాక్ రైస్ కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మగ, ఆడ లింగ భేదం లేకుండా అందరూ ఈ నల్లబియ్యాన్ని తమ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు వివరిస్తున్నారు.
BREAKING: రవిశాస్త్రికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ..