NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గన్నవరం గోల ఆగదా? వంశీ నడకలో ఏమైనా తప్పుందా?

 

 

గన్నవరం, వల్లభనేని వంశీ పేరు చెప్పగానే వివాదాలు, గొడవలు, రాజకీయ ఫైట్, నియోజకవర్గ లో నిత్యం తన పార్టీలోనే రచ్చ గుర్తుకు వస్తుంది. వైస్సార్సీపీ లో గ్రూప్ గొడవలకు గన్నవరం కేరాఫ్ అవుతుంది. ఎంత ఆపుదామన్న స్థానిక నేతల మధ్య సఖ్యత మాత్రం జూదరడం లేదు. ఫలితంగా టీడీపీ తరఫున గెలిచి వైస్సార్సీపీ లో అధికారికంగా చేరకపోయిన ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వల్లభనేని వంశీకి రోజు తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయి తప్ప తీరడం లేదు. ఇటీవల నియోజకవర్గంలో ఉప్పు నిప్పులా ఉంటూ ఒకేపార్టీలో సెగ రాజేస్తున్న ఎమ్మెల్యే వంశీ, డీసీసీబీ చైర్మన్ యార్లగడ్డలను స్వయంగా పార్టీ అధినేత ఒక కార్యక్రమంలో చేయి కలిపారు. జాగ్రత్తగా పని చేసుకోవాలని, విభేదాలు వద్దని చెప్పిన గన్నవరంలో మాత్రం అది పని చేయలేదు. నేతలు సైలెంట్ అయ్యి.. తమ అనుచరులను ఎగదోస్తున్నారు. దింతో నియోజకవర్గంలో ఎక్కడో దగ్గర రోజువారీ వైస్సార్సీపీ లో గ్రూప్ తగాదాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి.

నాయకుడు చెప్పినా అంతేనా ?

గన్నవరం నుంచి వల్లభనేని వంశీ వరుసగా 2014 , 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. జగన్ వావ్ లో సైతం 838 స్వల్ప తేడాతో టీడీపీ జెండా ఎగురవేశారు. అయితే దాని తర్వాత జరిగిన పరిణామాలతో వంశీ సొంత పార్టీతో విభేదించి అధికార పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక అప్పటినుంచి గన్నవరం రగిలే కాష్టంలా అయ్యింది. వంశీ మీద పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు కు జగన్ డీసీసీబీ చైర్మన్ లాంటి కీలక పదవి ఇచ్చారు. అయినా ఆయన వంశీకు నియోజకవర్గ పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా లేరు. ఎక్కడి నుంచో వచ్చి మరి పోటీ చేసానని, ఎన్నికల వేళ వంశీతో వచ్చిన మాటామాటా వాళ్ళ వ్యక్తికత ఇమేజ్ కోల్పాయాను అనేది వెంకట్రావు మాట. ఇప్పుడు వెనక్కు తగ్గేది లేదన్నది వెంకట్రావు అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తానే పోటీలో ఉండాలనేది ఆయన భావన.  మొదటి నుంచి వైస్సార్సీపీ లో తిరిగి, ఎన్నికల్లో వెంకట్రావు వెనుక తిరిగిన కేడర్ ఆయననే నమ్ముకుని ఉన్నారు. ఇప్పుడు వారే వంశీని అంగీకరించేందుకు ముందుకు రావడం లేదు. ఇదే గొడవలకు కారణం. చిన్న విషయాన్నీ సైతం పెద్దగా చేసేందుకు ఈ తెంపరితనమే కారణం అవుతుంది. అయితే సిట్టింగ్ గా ఉన్న వంశీని బలోపేతం చేయకుండా నిత్యం గొడవలతో సొంత కేడర్లో విభేదాలతో గన్నవరంను సంక్లిష్టంగా మారుస్తన్నారు అనేది విశ్లేషకుల మాట.

అందరితో కయ్యం పెట్టుకోవడమే కొంప ముంచిందా?

గన్నవరం కీలక నియోజకవర్గం . విజయవాడకు చుట్టూ ఉన్న నియోజకవర్గం. అందులోనే పుచ్చలపల్లి సుందరయ్య వంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం. గన్నవరం ఏకంగా 13 మండలల పరిధిలో విస్తరించింది. బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, అంపాపురం, పాతపాడు, ఫిర్యాది నైనవారం, నున్న, ఎనికేపాడు, నిడమానూరు, అత్కుర్, గూడవల్లి, ప్రసాదంపాడు, రామవరప్పాడు ల్లో ఉన్న మండళ్లలో ఒక్కో మండలంలో ఒక్కో సమస్య ఉంది. కొన్ని చోట్ల కులాల వర్గాలు, మరికొన్ని చోట్ల వ్యక్తుల అనుచరుల హవా ఎక్కువ కనిపించే నియోజకవర్గం. ప్రస్తుత శాసన సభ్యుడు వంశీ టీడీపీలో ఉన్నపుడు అందరితో పెట్టుకున్న కయ్యాలే ఇప్పుడు అయన కొంప ముంచుతున్నాయి అనేది సొంత పార్టీ నేతలే చెబుతున్న మాట. ఇటు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు కాదు, వైస్సార్సీపీ లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, పక్కనే ఉన్న దేవినేని కుటుంబం తో సైతం వంశీకి విబేధాలు ఉన్నాయి. ఇవి రచ్చకెక్కి రాష్ట్ర స్థాయి ప్రచారం పొందాయి. ఎన్నిక వేళ యార్లగడ్డ, వంశీ మధ్య మాటామాటా పెరిగి అది విజయవాడ పోలీస్ కమిషనర్ వరకు వెళ్ళింది. పలు విషయాల్లో దురుసుగా వెళ్లే వంశీ.. మాట తీరులోనూ ప్రత్యర్థుల్ని కడిగి పారేస్తారు. అప్పటి పరిస్థితుల్లో టీడీపీలో ఉన్న వంశీ అదే దురుసుగా ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ ప్రత్యర్థులే సొంత పార్టీ నేతలు కావడం, వారి అనుచరులు వంశీ రాక మీద మొదటి నుంచి కాక మీద ఉండటం వంటి కారణాలతో గన్నవరం చల్లబడటం లేదు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దీని మీద ద్రుష్టి నిలిపి, నాయకుల్ని కూర్చుబెట్టి దిశా నిర్దేశం చేస్తే తప్ప గొడవలు లేని గన్నవరం కనిపించదు.

author avatar
Special Bureau

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju