Big Boss 5: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ప్రతి ఏటా 100 రోజుల పాటు అద్దిరిపోయే వినోదాన్ని అందించే ప్రపంచపు అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మళ్లీ వచ్చేస్తోంది. ‘స్టార్ మా’ లో నే ఈ సారి బిగ్బాస్ సీజన్ కూడా టెలికాస్ట్ కాబోతోంది.
దీనికి సంబంధించి ‘స్టార్ మా’ ఛానల్ వారు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఒక 15 సెకన్ల వీడియో పోస్ట్ చేశారు. బిగ్బాస్ మ్యూజిక్ తో సరికొత్తగా లోగో ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే… ఈ లోగో ఒక పజిల్ లాగా ఉంది.
ఏదో చిక్కుముడిని విప్పాలి అన్నట్టు ఉన్న ఆ కన్ను ఉన్న వృత్తం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈసారి ఫార్మాట్ మారుతోందా…? సీక్రెట్ రూమ్ లాంటి కొత్త ఎలిమెంట్స్ ఏమైనా ఈ సీజన్లో తీసుకొని వస్తారా… అన్నది ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి తెలుగు బిగ్బాస్ ఇప్పటివరకు హిందీ వారిని అనుసరిస్తూ వస్తుంది అన్న విమర్శను స్టార్ మా యాజమాన్యం సీరియస్ గా తీసుకున్నట్లు ఉంది. ఇప్పటివరకు దేశంలో బిగ్ బాస్ షో వచ్చిన అన్ని భాషలను మించి డిఫరెంట్ గా ట్రై చేసినట్లు తెలుస్తోంది.
మరి పాత ఫార్మాటే రిపీట్ చేస్తారా లేదా కంటెస్టెంట్ లకు కొత్త చాలెంజ్ లు విసిరి ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తారా లేదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Checkout the aMAZEing first look of #BiggBossTelugu5 logo.
We are coming soon!! pic.twitter.com/GDwo8QAZYz
— starmaa (@StarMaa) August 1, 2021