బిగ్ బాస్ ఇంటి నుండి మెహబూబ్ ఎలిమినేట్ అవటంతో ఇంటిలో 8 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. దీంతో ఇంటిలో వాతావరణం సోమవారం నామినేషన్ ఎపిసోడ్ లో హాట్ హాట్ గా ఉంది రిలీజ్ అయిన ప్రోమో ని బట్టి. పూర్తి విషయంలోకి వెళితే నామినేషన్ లో సొహైల్ అభిజిత్ అదేవిధంగా హారిక కి మధ్య గట్టిగానే గొడవ జరిగినట్లు, వాదోపవాదాలు బికరా స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే సందర్భంలో సోహెల్…. అభిజిత్ కి పంచ్ వేస్తూ అఖిల్ తో చేతులు కలిపినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంమీద లీక్ వార్తల ప్రకారం ఈ వారం నామినేషన్ లలో ఇంటిలో ఉన్న ఆడవాళ్ళంతా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియ లో భారీ స్థాయిలో అఖిల్ మరియు అభి మధ్య గొడవ చాలా గట్టిగా జరిగినట్లు… వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా 11వ వారం నామినేషన్ లో ఆడవాళ్ళ మధ్య గొడవలు గట్టిగానే జరిగినట్లు లీక్ వీరుల వార్తల బట్టి సోషల్ మీడియా లో కామెంట్లు, డిస్కషన్ లు జరుగుతున్నాయి. ఏది ఏమైనా హౌస్ లో ఈ వారం ఇంటి సభ్యుల మధ్య హాట్ హాట్ వాతావరణం ఉంటుందని కామెంట్లు బయట గట్టిగా వినబడుతున్నాయి. సీక్రెట్ రూమ్ నుండి బయటకు వచ్చిన అఖిల్ కెప్టెన్ అవటంతో పాటు అభిజిత్ ని గట్టిగా టార్గెట్ చేసి ఇష్టానుసారం అయిన డైలాగులు వేయటం గ్యారెంటీగా జరుగుతుందని సోషల్ మీడియాలో డిస్కషన్ లు గట్టిగా జరుగుతున్నాయి.