తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది బిగ్ బాస్ షో. సీజన్ ఫోర్ కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయిన గాని, ఇంటి సభ్యులు కొత్త వారైనా గానీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఆడియన్స్ కు షో పై మరి ఇంత ఇంట్రెస్ట్ పుట్టించాయి. ప్రస్తుతం తొమ్మిదో వారంలో దిగ్విజయంగా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సగం జర్నీ ముగించుకోవటం జరిగింది.
సగానికి సగం మంది ఇంటి సభ్యులు హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఇంటి నుండి ఎలిమినేట్ అవుతుంది సభ్యులను బిగ్ బాస్ షో తరపున ఇంటర్వ్యూ చేస్తున్న బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్… ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు.
గంగవ్వ బయట చెట్ల కింద స్వేచ్ఛగా బతకడానికి అలవాటు పడి… ఇంటిలో ఉండ లేక పోయిందని పేర్కొన్నారు. ఇక తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ నోయల్ బయటకు రావడం తనకు బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ సారి సీజన్ విన్నర్ ఎవరో అవుతారని యాంకర్ ప్రశ్నించగా… ఆల్మోస్ట్ అభిజిత్ అవుతాడని భావిస్తున్నట్లు రాహుల్ సిప్లిగంజ్ తన అభిప్రాయాన్ని తెలిపారు. తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అభిజిత్, అరియానా, సోహెల్ అంటూ పేర్కొన్నారు. చాలావరకు అభిజిత్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు రాహుల్ సిప్లిగంజ్ తెలిపాడు.