NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

“ఆ ఇద్దరు’ లాంటోళ్ల కోసం చంద్రబాబు గాలింపు! ఎవరు వారు ? ఏమా కథ ??

ఇద్దరు పిల్లలు ముద్దు అంతకు మించి వద్దు అన్నది ఒకప్పుడు దేశంలో మారుమోగిన కుటుంబ నియంత్రణ నినాదం. అదే మాదిరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు జిల్లాలో ఇద్దరు ముగ్గురు సమర్థులైన నాయకులు ఉంటే చాలు మళ్లీ దూసుకుపోతానంటున్నారు.

2019 కేవలం ఇరవై మూడు సీట్లకు టిడిపి పరిమితమవడం తెలిసిందే. 38 సంవత్సరాల టీడీపీ చరిత్రలో ఇదే అత్యంత ఘోరపరాభవం. ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసిపి టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తోంది అలాగే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుని హోదా కూడా మిగలకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటోంది.ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మద్దాళి గిరి కరణం బలరామ్ వాసుపల్లి గణేష్ బాబులు వైసీపీ వైపు వెళ్లిపోయారు.ఇక పలువురు టిడిపి మాజీ ల సంగతి వేరుగా చెప్పనవసరం లేదు.ఒక్క మాటలో చెప్పాలంటే టిడిపి పరిస్థితి గోచరంగా ఉంది. 2024 ఎన్నికల నాటి కైనా టిడిపి ఉంటుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. అయితే ఇంతటి క్లిష్ట సమయంలోనూ విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు టిడిపి సీనియర్ నాయకులు వైసీపీని దీటుగా ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున విశాఖపట్నం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు.

వీరిలో వాసుపల్లి గణేష్ ఇప్పటికే జంప్ అయ్యారు.గణబాబు గంటా శ్రీనివాసరావు ఈ రోజో రేపో గోడ దూక బోతున్నారు.ఇక మిగిలిన ఏకైక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం వైసిపి గాలానికి చిక్కటం లేదు సరికదా టిడిపికి పూర్తి విధేయంగా పనిచేస్తున్నారు.విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్ సర్కారు.. అమరావతికి అండగా నిలుస్తుందంటూ టీడీపీపై చేస్తున్న విమర్శలను బలంగా తిప్పి కొట్టటమే కాదు.. రాజధాని విషయంలో టీడీపీ వైఖరి విశాఖ వాసులకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని సమర్థంగా చెప్పే ప్రయత్నాన్ని వెలగపూడి సాగిస్తున్నారు.అలాగే సీనియర్ మోస్ట్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా ఈ మధ్య దూకుడు పెంచారు.

రాష్ట్ర మంత్రి జయరాం పై ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు.కొత్త కొత్త కుంభకోణాలను బయటపెడుతున్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి నేతలు ప్రతి జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఉంటే మళ్లీ టిడిపికి ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చునని చంద్రబాబు ఆశాభావంతో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వైసీపీని ఎదుర్కోగల సత్తా గల దమ్మున్న టిడిపి నాయకుల కోసం జిల్లాలో చంద్రబాబు టార్చ్ లైట్ తో గాలిస్తున్నారు. అందరూ అనుకున్నంత బలహీనంగా చంద్రబాబు లేరని ఆయన ఏర్పాట్లలో ఆయన ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?