NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: బెజవాడలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం వైఎస్ జగన్

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించారు. కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ తో పాటు రివర్ ఫ్రంట్ పార్క్ ను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రూ.12.3 కోట్లతో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పార్క్ కు జలవిహార్ గా సీఎం జగన్ నామకరణం చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ .. రూ.369.89 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించడంతో కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. 80వేల మంది ప్రజలకు ముంపు నుండి రక్షణ లభిస్తుందన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదన్నారు. 369 కోట్లతో 2.26 కిలో మీటర్ల మేర వాల్ నిర్మాణం చేయడం జరిగిందన్నారు.

కృష్ణానదికి ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నది ఒడ్డున ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు. రిటైనింగ్ వాల్ తో పాటు అహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించేలా పార్క్ ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు కేశినేని నాని, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి దేవినేని అవినాష్, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లా, కల్పలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Breaking: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా.. కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju