NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: కేసిఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ సిద్దం చేస్తామన్న సీఎం రేవంత్ ..మేడగడ్డ సందర్శనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు డుమ్మా

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అయిదవ రోజు (నేడు) ఓట్ ఆన్ అకౌంట్ పై చర్చ జరగాల్సి ఉండగా, చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటన కు వెళ్లేలా ప్రభుత్వం ప్లాన్ సిద్దం చేసింది. ఈ క్రమంలో ఇవేళ ఉదయం సభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది. ఆపై మేడిగడ్డ సందర్శనకు తెలంగాణ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేలు బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక బస్సుల్లో వారు అసెంబ్లీ ప్రాంగణం నుండి బస్సుల్లో వెళుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యే లు ఈ మేడిగడ్డ సందర్శనకు బయలుదేరారు. రోడ్డు మార్గాన వీరు బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ కి చేరుకోనున్నారు. అక్కడ ప్రజాప్రతినిధుల బృందం రెండు గంటల పాటు ఉంటారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మేడిగడ్డపై ఎమ్మెల్యేలకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్శనకు అధికార పక్షంతో పాటు ఎంఐఎం, సీపీఐ సభ్యులు వెళ్లారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

తొలుత అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాళేశ్వరంపై అన్ని రకాలుగా పూర్తి స్థాయి సమీక్ష జరిగిందని తెలిపారు. ఇప్పటికే మంత్రుల బృందం మేడిగడ్డ ను పరిశీలించిందనీ, భారీ నష్టం జరిగిందనే అంచనాతో విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పారు. మేడిగడ్డ నిర్మాణంలో తప్పిదాలు ఉన్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా పేర్కొందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు 40,50 ఏళ్లు అవుతున్నా చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పుకొచ్చారు

కేసిఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ సిద్దం

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఖజానా డబ్బు వృథా అయ్యిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో లోపాలున్నాయని చెప్పారు. ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ కుంగిందంటున్నారని అన్నారు. మాజీ సీఎం కేసిఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మేడిగడ్డ పర్యటనకు వచ్చి ఆయన ఆవిష్కరించిన మేడిగడ్డ అద్భుతం గురించి అందరికీ వివరించాలని విజ్ఞప్తి చేశారు.

మేడిగడ్డ గురించి వాస్తవాలు తెలుసుకునే హక్కు తెలంగాణ ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెర తీద్దామనేది తమ ఆలోచన అన్నారు. త్వరలో మేడిగడ్డపై శ్వేత పత్రం విడుదల చేస్తామని చెప్పారు. మేడిగడ్డ ఎలా కుంగిపోయిందో కేసిఆర్ వివరిస్తే బాగుంటుందన్నారు. మేడిగడ్డ సందర్శనకు కేసిఆర్ తమతో పాటు బస్సు లో రావడానికి ఇబ్బంది అయితే ఆయన కోసం ప్రత్యేక హెలికాఫ్టర్ సిద్దం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. అనంతరం శాసనసభ రేపటికి (బుధవారం) వాయిదా పడింది.

BRS: గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇద్దరు కీలక నేతలు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

నీతులు చెప్పి గోతిలో ప‌డ్డ చంద్ర‌బాబు…!

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju

చింత‌ల‌పూడి టీడీపీ క్యాండెట్ ఫిక్స్‌… ‘ సొంగా రోష‌న్‌ ‘ కు టిక్కెట్ వెన‌క ఇంత గేమ్ న‌డిచిందా..!

సోమిరెడ్డికి షాక్.. హింట్ ఇచ్చేసిన చంద్ర‌బాబు.. వైసీపీ జంపింగ్‌కు స‌ర్వేప‌ల్లి సీటు..!