NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: పెద్ద ప్రమాదాన్నే పసిగట్టిన సీఎం జగన్!ఆదిలోనే ఆ నిప్పును ఆర్పే అద్భుత స్ట్రాటజీ!!

YS Jagan: Planning Blasting Changes in Party, Government

YS Jagan: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తన సర్కారు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు.ఉద్యోగులు కినుక వహిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న విషయం జగన్ కు తెలియంది కాదు.ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా,పవర్లో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి పోవాలన్నా ప్రభుత్వ ఉద్యోగులు కారకులవుతారు.

CM YS Jagan sensed a big danger!
CM YS Jagan sensed a big danger!

అందువల్లే పరిస్థితి పూర్తిగా చేజారకముందే ఆయన దీనికో రెమిడీని ఆలోచిస్తున్నారని సమాచారం.ఇందులో భాగంగా ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్య సంధానకర్తగా పోస్టు ఒకదాన్ని క్రియేట్ చేసి అందులో అనుభవమున్న ఉద్యోగ సంఘాల నేతను నియమించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఏపీఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస చంద్రశేఖర్ రెడ్డి పేరుఈ పోస్టుకు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలియవచ్చింది.

పదో తారీఖుకి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్ చేసిన పాదయాత్రలో ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు. వాటిని నిలబెట్టుకునే విషయంలో మాత్రం ప్రభుత్వం సక్సెస్ కాలేకపోయింది. అదే సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కూడా నానాటికీ దారుణంగా తయారవడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు, పించన్లు కూడా ఇవ్వలేని పరిస్ధితి ఎదురవుతోంది. అలాగే సీపీఎస్ రద్దు హామీని జగన్ నిలబెట్టుకోకపోవడం, డీఏలచెల్లింపులు కూడా వాయిదాల వారీగా సాగుతుండటం,పీఆర్సీ కొత్త నివేదికను పెండింగ్ లో ఉంచడం వంటి కారణాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి నానాటికీ పెరిగిపోతోంది.ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల డీఎలు ఇవ్వకపోవడం పీఆర్సీ నివేదికను ఆమోదించకపోవడం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు ఆ వాదనను అంగీకరించడం లేదు.సంక్షేమ పథకాల అమలుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎందుకని ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని వారు నిలదీస్తున్నారు.

YS Jagan: ముఖ్యమంత్రి దూరాలోచన!

ప్రభుత్వ ఉద్యోగుల లో బుసకొడుతున్న అసంతృప్తి ని ముఖ్యమంత్రి జగన్ తేలిగ్గా తీసుకోవడం లేదు.ఇప్పటికైనా ఇది తనకు ఇబ్బందికరమేనని ఆయన నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.అందుకనే ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఒక సంధానకర్తను నియమించి ఆయన ద్వారా ఉద్యోగ సంఘాలను బుజ్జగించే ఏర్పాట్లలో ముఖ్యమంత్రి ఉన్నారు.ఈ దశలో ఉద్యోగ సంఘాలతో సమన్వయం చేయగలిగిన సమర్థత ఉన్న నాయకులుగా వెన్నపూస చంద్రశేఖర్రెడ్డి ఆయన కంట్లో పడ్డారు.ఈరోజో రేపో ఆయనకు ఈ పోస్టును ఇవ్వబోతున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

 

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!