Darsi Result: దర్శిలో వైసీపీ ఓటమికి పది కారణాలు..! స్వీయ తప్పిదాలే ఎక్కువ!!

Share

Darsi Result: రాష్ట్రంలో రెండు రోజుల క్రితం జరిగిన నెల్లూరు నగర పాలక సంస్థ సహా 12 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఉదయం నుండి ఓట్ల లెక్కిపు కొనసాగుతోంది. కుప్పం, ఆకివీడు, పెనుగొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లి, కొండపల్లి ఇలా దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ ఊహించిన ఫలితాలే వచ్చాయి. అధికార పార్టీకి అనుకూల ఫలితాలే వచ్చాయి. కానీ ప్రకాశం జిల్లా దర్శి లో మాత్రం వైసీపీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది. దీనికి కారణాలు ఏమిటి ? దర్శిలో నిజంగానే వైసీపీ బలహీనంగా ఉందా ? దర్శిలో 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ క్యాండెట్ ప్రస్తుతం టీడీపీలో లేరు. అంతకు ముందు టీడీపీలో మంత్రిగా పని చేసిన సిద్దా రాఘవరావు కూడా టీడీపీలో లేరు. దర్శి టీడీపీకి ఒక పెద్ది దిక్కు అంటూ కూడా ఎవరూ లేరు. అటువంటి చోట తెలుగు దేశం పార్టీ ఎలా గెలిచింది..? దర్శిలో వైసీపీ ఎందుకు ఓడిపోయింది అనే దానికి ఓ పది కారణాలు ఉన్నాయి. దర్శి నగర పంచాయతీ ఎన్నిక ఫలితం రాష్ట్ర టీడీపికి ఒక స్పూర్తి పాఠం అయితే.. వైసీపీకి ఈ ఎన్నికల ఫలితం ఒక గుణ పాఠం కింద లెక్క. దర్శి మున్సిపాలిటీని ఊహించని విధంగా టీడీపీ దక్కించుకుంది. దర్శిలో టీడీపీ గెలుస్తుందని ఏ సర్వే సంస్థలు ఊహించలేదు. టీడీపీ ఇక్కడ గెలుస్తుంది అని కూడా అనుకోలేదు, వైసీపీ ఓడిపోతుందని అనుకోలేదు. కానీ ఊహకు అంతని ఫలితం వచ్చింది. దర్శిలో టీడీపీకి సైలెంట్ ఓటింగ్ పడింది.

Read More: BJP: చంద్రబాబు కావాలా..? జగన్ కావాలా..? ఒక్క మీటింగ్ లో తేల్చిన అమిత్ షా..!!

Darsi Result:సైలెంట్ ఓటింగ్‌కి కారణాలు ఇవే..

దర్శిలో 28,028 ఓట్లు ఉండగా 78 శాతం పోలింగ్ జరిగింది. సుమారుగా 22వేల ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో 14వేల ఓట్ల వరకూ టీడీపీకి పోల్ కాగా సుమారు 8వేల ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఏడు వార్డులు వైసీపీ గెలుచుకోగా 13 వార్డులు టీడీపీ గెలుచుకుంది. అంటే దాదాపు 62శాతం ఓటింగ్ టీడీపీకి వచ్చినట్లు కనబడుతోంది. వైసీపీ ఓటమికి ఈ పది కారణాలు పేర్కొనవచ్చు.

  1. అధికార పార్టీ మీద అవినీతి ఆరోపణలు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. ఆయన సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ ఉన్నారు. ఎమ్మెల్యే వేణుగోపాల్ కు అనేక వ్యాపారాలు ఉండటంతో ఆయన ఆ బిజీలో ఉంటుంటారు. ఇక్కడి వ్యవహారాలు అన్నీ ఎమ్మెల్యే సోదరుడు శ్రీధర్ చూస్తుంటారు. అయితే మొదటి నుండి ఇక్కడ అధికార పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.
  2. ఏజెంట్స్ నియామకాల వ్యవహారం. ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉండరు. అందుకే ఒంగోలులో ఉన్న ఆయన సన్నిహితులను దర్శికి తీసుకువచ్చి మండలానికి ఒక ఏజెంట్ గా నియమించుని అన్ని పనులను వాళ్ల ద్వారనే చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
  3. విబేధాలు, వివాదాలు, అధికార పార్టీలో రెండు గ్రూపులు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గం, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గంగా వైసీపీ ఉంది. వీరి మద్య విబేధాలు, వివాదాలు, వర్గ విబేధాలు ఉన్నాయి.
  4. రెడ్డి, కాపు వర్గాలు కలిసిపని చేయకపోవడం. మొత్తం 28వేల ఓటింగ్ లో పది వేల వరకూ రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఉండగా, 8నుండి 9వేల వరకూ కాపు సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి. ఈ రెండు వర్గాలు కలిసి పని చేస్తేనే ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. ఈ ఇద్దరి మధ్య విబేధాలు కారణంగా కాపు సామాజికవర్గ ఓట్లు టీడీపీకి పడ్డాయి.
  5. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఏకపక్షంగా వ్యవహరించడం, ఆయన వర్గాలను కలుపుకోలేకపోవడం కూడా ఓటమికి ఒక కారణంగా పేర్కొంటున్నారు. ఆయన ఏకపక్ష వైఖరి కారణంగా ఆ వర్గాలు సైలెంట్ గా దెబ్బెశాయి అని అంటున్నారు.
  6. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీరియస్ గా అభ్యర్ధుల గెలుపునకు కృషి చేయకపోవడం. ప్రచారం చేసినప్పటికీ అంతర్గతంగా చేయలేదనే వాదన వినబడుతోంది.
  7. తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ అధికార పార్టీ ధీటుగా పోల్ మేనేజ్‌మెంట్ చేయడం. ఐక్యంగా పని చేయడం. అక్కడి ఇన్ చార్జి పమిడి రమేష్ కు పెద్దగా పరిచయాలు లేకపోయినా జిల్లాలోని నాయకులు, దామచర్ల సత్య, టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావులు పమిడి రమేష్ ను ముందు పెట్టి ఐక్యంగా పని చేశారు.
  8. టీడీపీ చైర్మన్ అభ్యర్ధి నారపరెడ్డి పిచ్చయ్య గత ఎన్నికల్లో ఓడి పోయి ఉండటం వల్ల ఆయనపై ఉన్న సానుభూతి కోణం కూడా పని చేసింది.
  9. అన్నింటికంటే ముఖ్యంగా జిల్లాలో వైసీపీ పెద్దల వైఖరిని కూడా చెప్పుకోవాలి. దర్శి వైసీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నా జిల్లా మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వారి మధ్య సయోధ్యకు కృషి చేయలేదు. పైగా ఒక గ్రూపుకు కొమ్ము కాస్తూ మరో గ్రూపును పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాదు, ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో కూడా మంత్రి బాలినేని ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే దర్శే కాదు ఈ సమయంలో ప్రకాశం జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినా ఇదే తరహా ఫలితం వచ్చేదని జిల్లా వైసీపీలోనే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
  10. టీడీపీ పట్ల సానుభూతి. ఇంతకు ముందు మంత్రిగా పని చేసిన సిద్దా రాఘవరావు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అదే విధంగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కదిరి బాబూరావు కూడా పార్టీకి దూరమైయ్యారు. నాయకులు పార్టీని వదిలి పోతుండటంతో అధికార పార్టీ వారిపై ఒత్తడి చేస్తుందన్న భావతో టీడీపీ శ్రేణులు చురుకైయ్యారు. వైసీపీ ఓటమికి ఈ పది కారణాలు కనబడుతున్నా ప్రధానంగా రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు కలిసి పని చేయకపోవడం, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మద్య విబేధాలు, మాజీ ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకోకపోవడం, ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరిలు కారణంగా భావిస్తున్నారు.   

Share

Related posts

బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఇదే అంటూ బాబు మరో లేఖ

arun kanna

Buchibabu : ఉప్పెన బుచ్చిబాబు నెక్స్ట్ ఎంటీ..అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారా..?

GRK

మెకానిక్ రాహుల్

somaraju sharma