NewsOrbit
న్యూస్

అప్పులు… నేడు తప్పులు…! నాడు డప్పులు..!! ఈనాడు ఏమిటిదీ…??

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్ర‌మే అప్పులు చేస్తోంద‌ని, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మారుస్తోంద నే ఓ ఎల్లో ప్ర‌చారం ఊపందుకుంది.

 

అయిన దానికీ కానిదానికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంద‌ని, దీనిని ఇలా చేసుకుంటూ పోతే.. రాష్ట్రం అప్పుల పాల‌వుతుంద‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై టీడీపీ అనుకూల మీడియా దుమ్మెత్తి పోయ‌డం ప్రారంభించింది. మ‌రి ఇప్పుడు గొంతు చించుకుని క‌లాన్ని విరుగ్గొట్టుకుని మ‌రీ రాస్తున్న ఈ మీడియా.. చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన అప్పుల విష‌యంపై అప్ప‌ట్లోనూ ఇలానే వ్య‌వ‌హ‌రించిం దా? అప్ప‌ట్లోనూ ఇలానే రాసుకొచ్చిందా? అంటే.. ప్ర‌శ్న‌లు త‌ప్ప స‌మాధానాలు క‌నిపించ‌వు.

ఈ రోజు ఈనాడు దినపత్రిక రిజర్వ్ బ్యాంక్ బులిటెన్ పేరుతో రాసిన ఒక వార్తలో 2019 – 20 లో ధ‌నిక రాష్ట్రాలైన గుజ‌రాత్ 39 వేల కోట్లు , తెలంగాణా 37 వేల కోట్లు అప్పు చేస్తే ,ఏపీ 43 వేల కోట్లు అప్పు చేసిందని,
2020 మార్చి, ఏప్రిల్, మే 3 నెల‌ల్లో ఏపీ 10 వేల కోట్లు అప్పు చేస్తే తెలంగాణా ఏప్రిల్‌, మే 2 నెల‌ల్లో 8 వేల కోట్లు అప్పు చేసింది అని పేర్కొంది.మరి ఈ మాత్రం దానికేనా జగన్ చాల అప్పులు చేస్తున్నాడు అని ఎల్లో మీడియా విషం చిమ్మేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.నిజానికి 5 సం లలో 2.5 లక్షల కోట్ల అప్పు చేసి దిగిపోయాడు బాబు.చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోయిన మే 30, 2019న ( జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం రోజు) ` ఖ‌జానాలో కేవ‌లం రూ.100 కోట్లే ఉన్నాయి , జీత‌భ‌త్యాలు పెన్ష‌న్ల‌కు రూ. 7 నుంచి రూ.8 వేల కోట్ల కావాల`ని ఈనాడు ప‌త్రికే ఆ రోజు రాసింది.ఇప్పుడు మాత్రం రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది ఎల్లో మీడియా.అప్ప‌ట్లో చంద్ర‌బాబు చేసిన అప్పుల‌కు బోలెడు స‌మ‌ర్ధ‌న‌లు చోటు చేసుకున్నాయి.

రాష్ట్రాన్ని అనైతికంగా విభ‌జించార‌ని, లోటుబ‌డ్జెట్‌లో ఉన్న‌ద‌ని.. అందుకు అప్పులు చేయ‌క త‌ప్ప‌ద‌ని, మ‌న ఇంట్లోనే ఏదైనా అ వ‌స‌రం అయితే. మ‌న‌మైనా అప్పుల‌కు వెళ్ల‌డం లేదా? అని స‌మ‌ర్ధ‌నాపూర్వ‌క వ్యాసాలు , వార్త‌లు పుంఖా ను పుంఖాలుగా వెలువ‌రించింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు గ‌ద్దె దిగేనాటికి ల‌క్ష‌ల కోట్ల అప్పులో ఏపీ మునిగిపోయింది. దీనికి క‌ట్టాల్సిన వ‌డ్డీనే ఏటా 5 వేల కోట్లు! పోనీ .. ఈ అప్పులో ఏమైనా ప్ర‌జోప‌యోగ ప్రాజెక్టు ల‌కు బాబు ఖ‌ర్చు పెట్టారా?  అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు.త‌న ప్ర‌చారానికి, మీడియా యాడ్ల‌కు విప‌రీతంగా ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు చేశార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, ధ‌ర్మ పోరాట దీక్ష‌ల పేరుతో కోట్ల‌కు కోట్ల బాబు త‌గ‌లేసిన విష‌యం ఈ మీడియా కంటికి క‌నిపించ‌లేదు. ఇలా ఉన్న ప‌రిస్థితిలో ఏపీ స‌ర్కారు అప్పులు తీసుకునేందుకు విదేశాల‌కు వెళ్తోంది.. అని ఎల్లో మీడియా ప్ర‌చారం చేస్తోంది. వాస్త‌వానికి బాబు పెట్టిన పెండింగ్ బిల్లులలో 20 వేల కోట్లు జగన్ ప్రభుత్వం చెల్లించింది.

సంక్షేమ పథకాలపై 43 వేల కోట్లు ఖర్చు చేసింది.ఒక వేళ అప్పులు చేసినా.. వాటిని ప్ర‌జోప‌యోగ కార్య‌క్ర‌మాల‌కే క‌దా ఖ‌ర్చుచేస్తున్నట్టు స్పష్టమవుతోంది కదా?చంద్రబాబు సర్కారు మాదిరి అప్పులు చేసి ధ‌ర్మ పోరాట దీక్ష‌లు నిర్వహించటం, మాయా మ‌హ‌ళ్ల‌ను డిజిటిల్ తెర‌ల‌పై సృష్టి సృష్టించడం వంటివి చేయగా జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రజాసంక్షేమానికి మాత్రమే అప్పులు చేస్తోంది.మరి ఇంకా ఏడుపు ఎందుకు మాయామశ్చింద్ర లారా?









author avatar
Yandamuri

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju