Sweat Corn: మొక్కజొన్నల్లో అనేక రకాల వెరైటీలు అందుబాటులో ఉన్న కూడా మనకు దొరికేవి స్వీట్ కార్న్ లేదా దేశవాళీ మొక్కజొన్న మాత్రమే . ఇవి రెండూ మాత్రం మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి . స్వీట్ కార్న్ సంగతి అయితే చెప్పక్కరల.. మార్కెట్లో ఎప్పుడు కావాలన్నా ఉంటుంది. దేశవాళీ మొక్కజొన్న అయితే మాత్రం సీజన్లలోనేవాడుకోగలుగుతాం. వీటి రెండిటి రుచి వేరు వేరు గా ఉంటుంది.. అదే విధం గా ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అనేది తెలుసుకుందాం.
Sweat Corn: దేశవాళీ మొక్కజొన్న
స్వీట్ కార్న్ మన దేశానికి చెందినరకం కాకపోయినప్పటికీ రుచి కోసమే దీన్ని సాగు చేస్తున్నారు. స్వీట్ కార్న్ లో పిండి పదార్థాలు అధికం గా ఉంటాయి. పోషకాలు దాదాపు తక్కువగానే ఉంటాయి అని చెప్పక తప్పదు. చీడపీడలను తట్టుకుని నిలిచేందుకు క్రిమి సంహారక మందులను ఎక్కువగా వాడౌతుంటారు. స్వీట్‌కార్న్ హైబ్రిడ్ రకానికి చెందినది కావడం తో పాటు ఫైబర్ తక్కువగా ఉంటుంది.
ఇక దేశవాళీ మొక్కజొన్న పంటకు తక్కువ వనరులు సరిపోతాయి. చీడపీడలను ఎదురుకుని తక్కువ ఎరువులతో పెరగగలుగుతాయి. ఈ మొక్కజొన్నలో పిండి పదార్థాలు తక్కువగా ఉండడం తో పాటు పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అందుకే వీటిని తిన్నప్పుడు షుగర్ లెవల్స్ వెంటనే పెరగవు. అయితే స్వీట్ కార్న్ అలా కాదు. వాటిని తిన్న వెంటనే షుగర్ లెవల్స్ హెచ్చుగా ఉంటాయి.
పర్యావరణానికి కూడా మేలు
ఏ రకంగా అంచనా వేసుకున్న కూడా స్వీట్ కార్న్ తినడం కన్నా దేశవాళీ మొక్కజొన్నను తినడమే ఆరోగ్యానికి మంచిది.
స్వీట్ కార్న్ తో పోల్చి చుస్తే దేశీ మొక్క జొన్న తో ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది. అందుకే స్వీట్ కార్న్ కన్నా దేశీ మొక్కజొన్న తినడం అన్నివిధాలా మంచిది అని న్యూట్రీషియనిస్టులు కూడా తెలియచేస్తున్నారు.