NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

భారతీయ యూజర్లు కోసం గూగుల్, సరికొత్త ఫీచర్స్ …….

 

 

గూగుల్, పరిచయం అవసరం లేని పేరు..మన డైలీ లైఫ్ లో గూగుల్ ఒక భాగం అయిపోయింది. రోజు రోజుకి కొత్త ఆవిష్కరణలు తో ముందుకు వెళ్తున్న గూగుల్. కోవిద్-19 లాక్ డౌన్ మొదలు అయినప్పటినుండి 250 కొత్త ఫీచర్స్ ని ప్రవేశ పెట్టింది. తాజాగా భారతదేశ యూజర్ ల కోసం, రెండు యాప్ ను ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే గూగుల్ ఫోన్స్ లో, బీటా వర్షన్లో  అందుబాటులో ఉన్న ఈ యాప్స్ ఇపుడు భారత్ దేశం లో  అందరకి అందుబాటులోకి రానున్నాయి.

 

google

గూగుల్ కాల్:
ప్రస్తుతం అందరి స్మార్ట్ ఫోన్స్ లో తప్పకుండా ఉండే యాప్ “ట్రూ కాలర్”. ఈ యాప్ ఉపయోగించడం వల్ల , తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళ పేరును తెలియచేస్తుంది ఈ యాప్. అలాగే స్పాం కాల్స్ ను కూడా బ్లాక్ చేసుకున్నేసదుపాయం దీనిలో ఉంది.అయితే ఇది థర్డ్ పార్టీ యాప్ కావడంతో వినియోగదారుల భద్రతపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్ ట్రూకాలర్‌ తరహా ఫీచర్స్‌తో తన ఫోన్‌ యాప్‌లో మార్పులు చేస్తుందట. ఈ యాప్ ని “గూగుల్ కాల్” పేరుతో పిలుస్తున్నారు. త్వరలోనే ఈ యాప్‌ని యూజర్స్‌కి అందుబాటులో తీసురానున్నట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి. ఫోన్‌ అనే పేరు కాకుండా గూగుల్ కాల్ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌లో ఫోన్ చేసే వ్యక్తి పేరు తెలుస్తుంది. అంతేకాకుండా స్పామ్‌ కాల్స్‌ని నిరోధించవచ్చట. ఇవే కాకుండా మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్‌ గూగుల్ కాల్‌లో ఉంటాయని సమాచారం.

Caller ID Block by CallApp

ఇప్పటి వరకు గూగుల్ పిక్సెల్ ఫోన్ యూజర్స్‌కి మాత్రమే పరిమితమైన ఫోన్ యాప్‌ని ఇటీవల అన్ని రకాల ఫోన్ యూజర్స్‌కి ఉపయోగించొచ్చని గూగుల్ ప్రకటించింది. అలానే యాప్‌లో కొత్తగా కాలర్ ఐడీ ఫీచర్‌ను జోడించారు. దాంతో కాల్ వచ్చినప్పుడు కాలర్ పేరు, ఫోన్ నంబర్‌ చదివి వినిపిస్తుంది. దాంతో పాటు 30 రోజుల తర్వాత పాత కాల్ స్క్రీన్‌ రికార్డింగ్‌లు వాటంతటవే డిలీట్ అయ్యే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. తాజాగా ఫోన్ యాప్‌ పేరు మార్చి కొత్త ఫీచర్స్‌తో కాల్ యాప్‌తో యూజర్స్‌కి మరిన్ని మెరుగైన సేవలు అందించాలని గూగుల్ భావిస్తోంది. ఈ క్రొత్త యాప్ గురించి యూట్యూబ్ లో ఒక ప్రకటన కూడా వచ్చింది. యూట్యూబ్ లో వచ్చిన ప్రకటనలో గూగుల్ కాల్ యాప్ పేరు, లోగోను వెల్లడించింది. ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఇంకా అందుబాటులో లేనప్పటికి త్వరలో అధికారికంగా తీసుకురానున్నట్లు సమాచారం.

టాస్క్ మేట్:
మనం ఎపుడైనా ఒక్క ప్రదేశానికి వెళ్లినప్పుడు, గూగుల్ మనల్ని ఆ స్థలానికి సంబంధించి కొంత రివ్యూ ని అడుగుతూ ఉంటుంది. కొంత మంది ఓపిక గా సమాధానం ఇచ్చిన మారె కొంత మంది టైం వేస్ట్ అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు గూగుల్ దీనిని ఒక టాస్క్ గా మార్చి, ఏ టాస్క్ పూర్తి చేసినందుకు డబ్బులు కూడా ఇవ్వనుంది. ఈ కరోనా రోజుల్లో గూగుల్ తన టాస్క్ మేట్ యాప్‌ని ఇండియాలో టెస్ట్ చేయడం ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ఎవరైనా సరే మొబైల్ ద్వారా చిన్న చిన్న టాస్క్ లు పూర్తి చేసి డబ్బు సంపాదించవచ్చు. ఇది ఎలా అంటే  ప్రపంచవ్యాప్తంగా పనులు చేయంచుకునే వాళ్లంతా, ఈ యాప్‌లో ఏ పనిచెయ్యాలో చెబుతారు. దానికి ఎంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నదీ చెబుతారు. మీకు ఆ పని వీలు అయినది అయితే మీరు ఆ పని పూర్తి చేసి డబ్బు సంపాదించవచ్చు. ఇలా పనులు ఇచ్చేవారిలో వ్యాపారులు, ఆర్టిస్టులు, సెలబ్రిటీలు అందరూ ఉంటారు. ఇచ్చే పనులు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు రెస్టారెంట్ యొక్క చిత్రాన్ని క్లిక్ చేయడం, వ్యక్తిగత ప్రాధాన్యతల గురించి సర్వే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదా వాక్యాలను ఇంగ్లీష్ నుండి ఇతర భాషలకు అనువదించడంలో సహాయపడటం వంటివి వీటిలో ఉన్నాయి. వినియోగదారులు వారు పూర్తి చేసిన టాస్క్ ల కోసం స్థానిక కరెన్సీలో డబ్బు సంపాదించవచ్చు.

google task mate app lets you earn money

ఇది ప్రస్తుతం బీటా వెర్షన్ లో అందుబాటు లో ఉంది. అంటే అందరూ వాడేందుకు వీలుకాదు. రిఫరల్ కోడ్ సిస్టం ద్వారా,సెలక్ అయ్యే వారు మాత్రమే వాడేందుకు వీలవుతుంది. ఆల్రెడీ యాప్ వాడుతున్న వారు మీకు రిఫరల్ కోడ్ పంపాల్సి ఉంటుంది. యాప్‌ ను ఓపెన్ చేసాక, మీ చుట్టుపక్కల ఉన్న టాస్కులను మీరు వెతుక్కోవడానికి ఈ యాప్ lo ఫైండ్ టాస్క్ నియర్ బై అన్నే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు టాస్క్ ల వివరాలు తెలుస్తాయి. మీకు ఆ పని నచ్చితే,పనిచేయడానికి “కంప్లీట్ ఏ టాస్క్ టూ బిగిన్ ఎర్నింగ్” ఆప్షన్ సెలెక్ట్ చేస్కోవడం ద్వారా మీరు ఈ పని పూర్తి చేయవచ్చు.
పని పూర్తయ్యాక క్యాష్ అవుట్ యువర్ ఎర్ నింగ్స్ ఆప్షన్ ద్వారా డబ్బు పొందొచ్చు. మీరు రిజిస్టర్ చేసుకునే ఈ-వాలెట్‌ లోకి లేదా యాప్ పేమెంట్ పార్ట్‌నర్‌లోకి డబ్బు వస్తుంది. ఇందులో గూగుల్ కూడా టాస్కులు ఇస్తుంది. కొన్నాళ్ల తర్వాత గూగుల్ దీన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తుంది. అప్పుడు ఎవరైనా ఈ యాప్ ను ఉపయోగించి, డబ్బు సంపాదించవచ్చు.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju