హాట్ అందాల‌తో అద‌ర‌గొట్టేస్తున్న సమంత‌.. బాత్‌టబ్‌లో ఆలా!

Share

టాలీవుడ్ కుంద‌న‌పు బొమ్మ స‌మంత.. ప్ర‌స్తుతం ఇప్పుడు బుల్లితెర‌తో పాటు వెండితెర‌పైనా బిజీబిజీగా గ‌డుపుతూ.. ప్రేక్ష‌కుల‌కు క‌నుల‌విందు చేస్తోంది. మోడ‌ల్‌గా కెరియ‌ర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ‌… 2010లో ఏం మాయ చేశావే సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. ఈ సినిమాలో నాగ్ చైత‌న్య‌తో జ‌త‌క‌ట్టి.. కుంద‌న‌పు బొమ్మ‌గా కుర్ర‌కారు గుండెజారి గ‌ల్లంత‌య్యేలా చేసింది. మొద‌టి సినిమాతోనే ఫిలీంఫేర్ అవార్డు, నంది స్పేష‌ల్ జ్యూరీ, సినీ మా ఉత్త‌మ న‌టి అవార్డుల‌ను సొంతం చేసుకుంది.

ఆ త‌రువాత త‌మిళ్‌, తెలుగు, మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీల‌లో న‌టించారు స‌మంత‌. ఆయా ప‌రిశ్ర‌మ‌ల్లో టాప్ హీరోల‌తో న‌టించి.. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మ‌డు.. ద‌క్షిణాది స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్నారు. ఏం మాయ చేశావే సినిమాలో న‌టించిన అక్కినేని న‌ట‌వార‌సుడు నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డిన ఈ అందాల భామ‌.. పెళ్లి చేసుకునీ, టాలీవుడ్ అందాల జంట‌గా చైతు-సామ్‌ల జంట క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలతో పాటు బుల్లితెర కార్య‌క్ర‌మాలు చేస్తోంది ఈ ఓ బేబీ.

ఇటీవ‌లే ఓటీటీ ప్లాట్‌ఫామ్ “ఆహా” కోసం.. “సామ్‌జామ్” పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టింది స‌మంత‌. అలాగే, బిగ్‌బాస్ 4 సీజ‌న్‌కు ప‌లు ఎపిసోడ్‌ల‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించి అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఇలా బిజీబిజీగా ఉన్న స‌మంతా.. తాజాగా కొంచే గ్యాప్ దోర‌క‌డంతో విదేశాల‌కు విహార‌యాత్ర‌ల‌కు వెళ్లింది చైతు-సామ్‌ల జంట‌. ఇటీవ‌లే మ‌ల్దీవుల‌కు వెళ్లిన కథానాయిక‌లు కాజ‌ల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌ణీత వంటి వారు అక్క‌డ తెగ సంద‌డి చేస్తున్నారు. ప్ర‌స్తుతం చైతు-సామ్‌ల జంట కూడా మ‌ల్దీవుల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

దానికి సంబంధించిన ఫొటోల‌ను స‌మంత.. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిమానుల‌తో పంచుకున్నారు. ఆ ఫొటోల‌లో ఈ కుంద‌న‌పు బొమ్మ త‌న అందాల‌ను చూపుతూ.. తెగ ఆక‌ర్షిస్తోంది. మ‌రీ ముఖ్యంగా బికినీ ధ‌రించి.. త‌న హాట్ హాట్ అందాల‌ను చూపుతూ.. రోమాంటిక్ చిరున‌వ్వుతో మ‌త్తెక్కిస్తోంది. పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత నుంచి ఇలాంటి ఫొటోలు రావ‌డంప‌ట్ల ఆమె అభిమానుల కొంత నిరాశ‌కు గుర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు మీరు చూసేయండి మ‌రి..!


Share

Related posts

Bheemla Nayak: “బీమ్లా నాయక్” విషయంలో పవన్ కి బిగ్ హెల్ప్ చేసిన దగ్గుబట్టి సురేష్..!!

sekhar

Today Horoscope డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.

Sree matha

కరోనా నుండి కోలుకున్న ఐశ్వర్యరాయి కూతురు ఆరాధ్య .!!

sekhar