అలసిన కంటిని ఇలా కాపాడుకోండి!!

అన్ని అవయవాలలో కళ్ళు ప్రధానమయినవి అంటారు. కళ్లు,కంటి చూపు  పదిలంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం తీరిక లేని కాలంలో చాలా మందికి  జాగ్రత్తలు తీసుకునే సమయం దొరకడం లేదు. దీంతో కళ్లు అలిసిపోతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం..

అలసిన కంటిని ఇలా కాపాడుకోండి!!

  • ఎక్కువ  సేపు చదువుకోవలిసి వచ్చినప్పుడు  ఆ ప్రదేశం లో  ఖచ్చితంగా తగిన వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి .
  • కంప్యూటర్ ముందు పని చేసేవారు  ప్రతి రెండు గంటలకు ఒకసారి కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.
  • కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. అంటే.. దగ్గర, దూరం వస్తువులు మార్చి మార్చి చూడాలి. కళ్ళను అట్టు ఇటు నెమ్మదిగా కదుపుతూ ఉండాలి.
  • కళ్లు అలిసిపోయినట్లు ఉంటే కీరా దోసకాయముక్కను కానీ,చల్లని నీటిలో ముంచిన దూదిని కానీ కళ్లపై పెట్టుకోవాలి.
  • రోజుకి కనీసం 8 గంటల నిద్ర ఉండే లా చూసుకోవాలి. లేదంటే నిద్రలేమి వలన తలనొప్పి, అలసట మరియు చూపు మసకగా ఉండడం వంటివి జరుగుతాయి. అందువల్ల నిద్ర బాగా ఉంటె మంచి చూపు కంటి కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. ఎండలోకి వెళ్లినప్పుడు సన్‌గ్లాసెస్ వాడితే కళ్లకి ఉపశమనంగా ఉంటుంది.
  • వారంలో ఒకసారి కొబ్బరి నూనె తో తలపై మసాజ్ చేసుకోవాలి.అది కంటి చూపు బాగా ఉండేలా చేస్తుంది.
  • పాల కూర వలన కంటిశుక్లం, కళ్ళు  మసకగాబారడం వంటి అనేక కంటి సంబంధిత సమస్యల ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

    కళ్ళు బాగా అలసినప్పుడు మీ రెండు అర చేతులను బాగా రుద్ది ఆ వేడిని కళ్ళ  మీద పెట్టుకొవాలి. కంటి అలసటతగ్గించుకునేందుకు ఇది మంచి చిట్కా గా పని చేస్తుంది