NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Helicopter Service For Medaram Jatara: మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ .. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాఫ్టర్ సేవలు

Helicopter Service For Medaram Jatara: అసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల 21వ తేదీ నుండి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. అయితే..భక్తుల తాకిడి జాతరకు పది రోజుల ముందే ప్రారంభమైంది.

జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించే భక్తులు ముందుగానే మేడారంకు చేరుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా..దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు లక్షలాదిగా తరలివస్తున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని నలుమూలల నుండి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనే కాకుండా ప్రైవేటు వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

 medaram sammakka saralamma jatara

అయితే అతి తక్కువ సమయంలో మేడారం జాతరకు వెళ్లి వనదేవతలకు మొక్కుబడులు చెల్లించి తిరిగి రావాలనుకునే భక్తుల కోసం హెలికాఫ్టర్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. గత మూడు జాతరల నుండి భక్తులకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆకాశ మార్గంలో మేడారంకు చేరుకుని అమ్మల దర్శనానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హెలికాఫ్టర్ ద్వారా మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శన సదుపాయం కూడా ఉంటుంది. వీరు మొక్కులు చెల్లించిన తర్వాత వెంటనే తిరుగు ప్రయాణం అవ్వవచ్చు. దీని వల్ల వారికి చాలా సమయం కలసి వస్తుంది. కొద్ది గంటల వ్యవధిలోనే దర్శనం, మొక్కుబడులు పూర్తి చేసుకుని స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అలానే భక్తుల కోసం ప్రత్యేకంగా హెలీకాఫ్టర్ జాయ్ రైడ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 21 నుండి 25వరకూ హెలికాఫ్టర్ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే టికెట్ ధరలను రెండు రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలుస్తొంది.

గత జాతర సమయంలో హన్మకొండ నుండి మేడారం షటిల్ సర్వీస్ ఒక్కో ప్రయాణికుడికి (అప్ అండ్ డౌన్) రూ.19,999లు చార్జి వసూలు చేశారు. అలానే జాతరలో 7,8 నిమిషాల ఏరియల్ వ్యూ రైడ్ ఒక్కొక్కరికి రూ.3,700లు చార్జి వసూలు చేశారు. ఇంతకు ముందూ మేడారంలో హెలికాఫ్టర్ రైడ్ కు విశేష స్పందన లభించింది. హెలికాఫ్టర్ ఎక్కి సమ్మక్క సారలమ్మ వార్ల గద్దెలు, జంపన్న వాగు గుట్టలు పై నుండి మేడారం అందాలు చూసేందుకు యాత్రికులు ఆసక్తి కనబరుస్తుంటారు. మేడారం జాతర సందర్భంగా జాయ్ రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.

CM YS Jagan: నేటి వాలంటీర్లు రాబోయే రోజుల్లో నేతలు – జగన్

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N