Sunil: తెలుగు హీరో సునీల్ గురించి పరిచయం అక్కర్లేదు. అతని అసలు పేరు ఎవరికీ తెలియదు. ఇందుకూరి సునీల్ వర్మ కాలానుగుణంగా సునీల్ గా పేరు సంపాదించాడు. సుమారు 210 సినిమాలకు పైగా చిత్రాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాడు. మొదట ఎక్కువ హాస్య ప్రధాన పాత్రల్లో నటించి తర్వాత కథానాయకుడిగా మారాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, సొంతం సినిమాలు సునీల్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన మర్యాదరామన్న సినిమా మంచి ప్రజాదరణ పొందింది.
Sunil: సునీల్‌తో బంతి సినిమా తీస్తానన్న త్రివిక్రమ్ బంతిలా తిప్పుకుంటున్నాడా…?
Sunil: సునీల్ కొత్తదనం:
సునీల్ హీరోగా వరుస పరాజయాలను పొందడంతో తరువాత కమెడియన్ గానే కొనసాగాలని ప్రయత్నించాడు. ఇక ఆయన ఆశించిన స్థాయిలో పాత్రలు పడకపోవడంతో విలక్షణమైన పాత్రలపై దృష్టిపెడుతూ ఆ దిశగా అడుగులు వేసేసరికి బాగానే వర్కవుట్ అయింది. దాంతో విలక్షణమైన పాత్రలు సునీల్ ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో ‘కలర్ ఫొటో’, ‘పుష్ప’ సినిమాలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Sunil: కన్ఫ్యూజన్గా సాగుతున్న సునీల్ కెరీర్..రామ్ చరణ్ – శంకర్ సినిమాతోనైనా సెట్ అవుతుందా..?
సునీల్ కొత్త సినిమా ఇదే!
కలర్ ఫోటో, పుష్ప సినిమాలు సునీల్ కి మంచి అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో సునీల్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘కుంభకర్ణ’. ఈ టైటిల్ ను ఖరారు చేసి తాజాగా చిత్ర యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘పడుకుంటే పోతాడు’ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. దాంతో ఈ సినిమాపైన అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ అని సమాచారం. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను కబీర్ దుహాన్ సింగ్ పోషిస్తున్నాడు. ఈ సినిమాతో అభిరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.