NewsOrbit
న్యూస్

అక్రమ మైనింగ్ లో ‘గాలి’ తర్వాత స్థానం ‘జేసీ’ దేనా? మామూలుగా తవ్వేయలేదుగా!!

జేసీ దివాకర్‌ రెడ్డి.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. తన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే జేసీ.. తన సిమెంట్‌ కంపెనీ త్రిశూల్‌తో మరోసారి వార్తల్లోకెక్కారు.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన పై ఫోకస్ పెరిగింది .టీడీపీలోకి వెళ్లి తనను తీవ్రంగా దూషించిన దివాకర్ రెడ్డిపై జగన్ ఒక కన్నేశారు.జగన్ అధికారంలోకి రాగానే ఆపరేషన్ జేసీ మొదలైంది.దీంతో జేసీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం ప్రారంభమైంది. జేసి ట్రావెల్స్ పేరుతో ఫోర్జరీ సంతకాలతో నిరభ్యంతర పత్రాలు సృష్టించి తుప్పు పట్టిన లారీలను బస్సులుగా మార్చి అమ్మి సొమ్ము చేసుకున్న కేసు తర్వాత త్రిశూల్ సిమెంట్ కంపెనీ పేరుతో మైనింగ్ అక్రమాలకు పాల్పడిన ఇంకో కేసు బయటికి వచ్చింది..రాష్ట్ర మైనింగ్‌ శాఖ అధికారులు జేసీ కుటుంబానికి మరో షాక్ ఇచ్చారు..

illegal mining latest news
illegal mining latest news

మైనింగ్‌ అక్రమాలకు సంబంధించి వందకోట్ల రూపాయల జరిమాన చెల్లించాలంటూ నోటీసులు పంపారు.. హైకోర్టు ఆదేశాలతో త్రిశూల్ సిమెంట్ కంపెనీ అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.. ఈ విచారణలో మైనింగ్ శాఖ అధికారులు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు… లక్షా 21 వేల 956 మెట్రిక్ టన్నులకు మైనింగ్‌ పర్మిషన్ తీసుకొన్న త్రిశూల్ సింమెంట్ కంపెనీ… దాదాపు 14 లక్షల మెట్రిక్ టన్నుల విలువైన వైట్ స్టోన్ తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు..అక్రమ మైనింగ్‌పై ఈ ఏడాది మే 7న త్రిశూల్‌ కంపెనీ యజమానులకు మైనింగ్‌ శాఖ అధికారులు నోటీసులు పంపారు15 రోజులలో వివరణ ఇవ్వాలని కోరారు.. అయితే ఈ నోటీసులపై త్రిశూల్‌ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు.. దీంతో ఆగస్టు 20న 100 కోట్ల 24 లక్షల 44 వేల రూపాయలు జరిమాన విధిస్తూ నోటీసులు జారీ చేసింది.

illegal mining latest news
illegal mining latest news

జరిమాన విధించిన సొమ్మను వెంటనే చెల్లించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. ఒక వేళ జరిమాన చెల్లించకపోతే పోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులు జప్తు చేస్తామని కూడా నోటీసుల్లో హెచ్చరించింది. అదే సమయంలో త్రిశూల్ కంపెనీ షేర్ హోల్డర్లైన 8 మందికి సంబంధించిన ఆస్తులను గుర్తించాలని ఐదు మండలాల తహసీల్దార్‌లను ఆదేశించింది.మైనింగ్‌ శాఖ ఆదేశాలతో యాడికి, పెద్దపప్పూరు, తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు మండలాల తహశీల్దార్లు.. విచారణ జరిపారు. త్రిశూల్ సిమెంట్ కంపెనీ షేర్ హోల్డర్లకు తమ ప్రాంతాల్లో ఆస్తులు లేవని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో మైనింగ్ శాఖ త్రిశూల్ కంపెనీ షేర్ హోల్డర్ల ఆస్తులకు సంబంధించిన సర్వే నెంబర్లు ఇచ్చి ఇవి వారివా? కాదా? గుర్తించాలని.. కోరింది. ఒక వేళ ఆ ఆస్తులు వారివని తేలితే అటాచ్ చేయాలని మైనింగ్ శాఖ తాహసిల్దార్లకు ఆదేశాలు జారి చేసింది.జగన్ సర్కార్ దెబ్బకు జేసీ బ్రదర్స్ విలవిల్లాడుతున్నారనే చెప్పాలి!

author avatar
Yandamuri

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju