సన్ఫ్లవర్ సీడ్స్… వాటి రుచి చాలామంది ఇష్టపడతారు.ఇవి మార్కెట్ లో మనకు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఉండే కేలరీలతోపాటూ,ముఖ్యమైన విటమిన్స్,ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఈ విత్తనాలు పొద్దు తిరుగుడు పువ్వు మధ్య లో ఉంటాయి. ఇవి నలుపు రంగు లో లేదా బూడిద రంగు లో ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సీ గుండె జబ్బులు రాకుండా రక్షణ కల్పిస్తుంది. విటమిన్ ఈ… ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఓ పావు కప్పు గింజలు రోజూ తింటే మనకు అవసరమైన విటమిన్ E 90 శాతం పొందినట్టే.
పొద్దుతిరుగుడు పప్పు లో కొలెస్ట్రాల్ తగ్గేందుకు కావలిసిన ఫైబర్,ఉంటుంది .
ఇవి జీర్ణశక్తిని పెంచి మల బద్ధకాన్ని నివారిస్తుంది.
ఈ విత్తనాల్లోని విటమిన్ E, కాపర్సెలెనియం లు విష వ్యర్థాల్నిఅడ్డుకుంటాయి. ఇవి కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి.బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, రాకుండా అడ్డుకుంటాయి.
ఈ విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఎముకలు గట్టి పడేలచేస్తుంది. నరాలకువిశ్రాంతి ని ఇస్తుంది. మన మనస్సు ప్రశాంతం గా ఉంచి సానుకూలం గా స్పందించే విధం గా చేసి ఒత్తిడిని దూరం చేస్తాయి.
ఈ గింజల్లోఉండే కాపర్ ఎముకల జాయింట్లు బాగా పని చేసేలా చేస్తుంది.సన్ ఫ్లవర్ విత్తనాల్లోని విటమిన్ E,మెగ్నీషియం ఉండడం వలన ఈ విత్తనాలు తింటే… శరీరంలో మంటలు, వాపులుతగ్గిపోతాయి .
శరీరంలోకి విష వ్యర్థాలు చేరకుండా ఈ విత్తనాల్లోని విటమిన్ E రక్షణ ఇస్తుంది.షుగర్ బారిన పడకుండా కాపాడుతుంది.
ఈ విత్తనాలను రైస్, యోగర్ట్,శాండ్విచ్, పాస్తా, లలో వేసుకుని తినవచ్చు.
విటమిన్ E హైబీపీ కంట్రోల్ చేస్తుంది.
ఇవి మన ఊపిరి తిత్తులకు రక్షణ కల్పిస్తాయి. ఊపిరి పీల్చే టప్పుడు, వదిలేటప్పుడూసమస్యలు ఉంటే పరిష్కరిస్తుంది.
పిల్లలకు వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచీ రక్షణ గా ఈ సీడ్స్ బాగా పనిచేస్తాయి .
కీళ్ల నొప్పుల్ని తగ్గించడం లో కూడా ఈ పప్పులు బాగా పనిచేస్తాయి. ఈ విషయం పరిశోధనల్లో స్పష్టంగా బయట పడింది.
ఈ విత్తనాలతో తీసిన నూనెలో లో విటమిన్ ఏ ఉంటుంది. అది కంటి చూపును పెంచుతుంది.
ఈ గింజల్లో కావాల్సినంత జింక్ ఉండడం వలన వ్యాధి నిరోధక శక్తిని పెరుగుతుంది. ఈ విత్తనాల్లోఉండే రాగి, మన చర్మాన్ని ఆరోగ్యంగాఉంచడానికి ఉపయోగపడుతుంది . కాపర్ మన శరీరానికి అవసరమైన మెలనిన్ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ గింజలు ముసలితనం రాకుండా చెయ్యడంలో ఎంతో బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు, మన చర్మానికి అత్యంత ప్రయోజనాన్ని ఇస్తాయి. విటమిన్ E స్కిన్ పాడు కాకుండా కాపాడుతుంది. చర్మం మెరిసిపోయేలా చేస్తుంది.
మన వెంట్రుకలకు అవసరమైన ప్రోటీన్స్, సెలెనియం,విటమిన్ ఈ, బీ వంటి వి ఈ గింజలు తినడంవలన మనకు అందుతాయి . వీటిని తినడం వలన జుట్టు బాగా పెరగడంతో పాటు, జుట్టు ఉండడం కూడా తగ్గించుకోవచ్చు. జుట్టు తెల్లబడే సమస్యను కూడా ఈ గింజలు తగ్గిస్తాయి.