జగన్ కాసేపు సైలెంట్ అయ్యాడు ! టీడీపీ పై బిజెపి గురి పెట్టింది !

Share

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అని తెలుగులో ఒక సామెత ఉంది! అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి బాగా వర్తిస్తుంది.

Jagan became silent for a while BJP targets TDP
Jagan became silent for a while BJP targets TDP

అప్పట్లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ మొత్తం ఉందని మైండ్ గేమ్ ఆడి బాబు ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ని పదవి నుంచి దింపేసి సీఎం పీఠం దక్కించుకున్నారు.ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ ఇదే ధోరణిలో సాగుతున్నాయి.అన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే మైండ్గేమ్ పితామహుడిని దెబ్బతీయడమే లక్ష్యంగా బిజెపి వైసిపి పావులు కదపడం!ఈ మైండ్ గేమ్ తో ఏనుగు లాంటి టీడీపీని పీనుగు చేద్దామన్నదే వాటి ఎత్తుగడ. ముందుగా బిజెపి విషయానికొస్తే ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలం ఎవరికీ లెక్కతేలదు.

కాని బిజెపి మాత్రం తాను చాలా బలపడ్డానన్న కలరింగ్ ఇస్తోంది .మెగాస్టార్ చిరంజీవితో సహా ఏపీలోని కాపుల౦తా తమ వైపే ఉన్నారని ఇరవై ఏడు శాతం ఓటు బ్యాంకు తమకుందని బీజేపీ నూతన చీఫ్ వీర్రాజు ఊదరగొడుతున్నారు. టిడిపి పని అయిపోయిందని టిడిపికి ఓట్లు కూడా బీజేపీకి రాబోతునాయని ఆయన విశ్లేషిస్తున్నారు.ఇది కేవలం బిజెపి మైండ్ గేమ్ .టిడిపిని దెబ్బ కొట్టడానికి ఈ ఆట ఆడుతోంది.అదే సమయంలో వైసిపి కొత్తరకం గేమ్ మొదలుపెట్టింది. తమ పార్టీలోకి ఎవరు రావాలన్నా రాజీనామా చేయాలని షరతు విధించడం కూడా ఇందులో భాగమే అంటున్నారు.

అలాగే ఎంతో మంది టీడీపీ నేతలు వస్తామన్నా కూడా జగన్ అంగీకరించడంలేదు. దీని వెనక కూడా మతలబు ఉందని అంటున్నారు. ఏపీలో వారిని బీజేపీకి వదిలేయడానికే జగన్ చేర్చుకోవడంలేదని కూడా వినిపిస్తున్న మాట.
చంద్రబాబుకు అయితే ఏపీలో బీజేపీ వైసీపీ పక్కా మైండ్ గేమ్ ఆడుతున్నవని తెలుసు. బాబు ఈ మైండ్ గేమ్ ను ఎలా ఎదుర్కొంటారా అన్నదే చర్చ. ఎదురుగా కనిపించే ప్రత్యక్ష శత్రువు వైసీపీ అయితే చాపకింద నీరులా వస్తున్న బిజెపి ని చూసి చంద్రబాబు మైండ్ బ్లాక్ అవుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు!


Share

Related posts

కడప జమ్మలమడుగులో రాజస్తాన్ వ్యక్తి కి కరోన పాజిటివ్

Siva Prasad

Congress : సీఎం అయ్యే వ్య‌క్తి బీజేపీలో చేరి .. కాంగ్రెస్ కు షాకిస్తార‌ట‌…

sridhar

వారం తర్వాత బయట పడిన బొత్స అమరావతి పర్యటన రహస్యం! వారినీ…అందుకా అంత హడావుడి?

Yandamuri