NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఇదే జనసేన మార్కు పవన్ : వీటినే కొత్త రాజకీయాలు అంటారు

 

 

అదో నిర్మానుశ్య ప్రదేశం… గ్రామీణ ప్రాంతం… పట్టుమని పది మంది కుర్రాళ్ళు లేని ప్రదేశం... కళ్యాణ్ వస్తున్నాడు అంట్రా… కనిపిస్తే పండగే… అని రోడ్డు మీద వేచి చూస్తున్న ఆ యువకుల వద్ద వాహన కన్వాయ్ ఆగింది… చిరుజల్లులు పడుతున్న సమయం అది… వాగులు పొంగుతూ రోడ్డు సైతం కనిపించని వేళ ఆ కన్వయ్ నుంచి తాము ఎదురు చూసే నాయకుడు దిగాడు… కనీసం వాహనం లో నుంచి ఐనా కనిపిస్తాడు అనుకున్న తమ నాయకుడు…. ఆ యువకుల వద్దకు వచ్చాడు.. వారందరిని గుంపుగా చేసి ఆ గుంపులో తాను కూర్చుని మాట్లాడాడు… రోడ్డే సభ ప్రాంగణం అయ్యింది… చుట్టుపక్కల ఉన్న యువతే సభలో అధ్యక్షులు అయ్యారు… కనివినీ ఎరుగని కలయిక ఇది….. జనసేనాని యువత ను కలుసుకున్న తీరు…. రోడ్డు మీదనే వారితో మమేకం అయిన తీరు ఇప్పుడు ముచ్చట గోలిపేలా ఉందని, జనసైనికులు ఆనంద పడుతున్నారు.. నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని కలుపుకునేందుకు నెల్లూరు జిల్లా వచ్చిన ఆయన గూడూరు సమీపంలో రోడ్డుపై ఆగి అక్కడున్న రోడ్లను పరిశీలించి, అనంతరం అక్కడే రోడ్డుపై ఉన్న యువతను కలుసుకున్న తీరు.. వారిని చుట్టే కూర్చోబెట్టుకొని మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియా లో సంతోషాన్ని పంచుకుంటున్నారు…

 

pawan kalyan with janasainikas

ఇదే అసలైన ప్రత్యామ్నాయం

పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు కొత్త రాజకీయాలు అంటే ఇవే. దీనికి పైసా ఖర్చు అక్కర్లేదు. కేవలం సమయం ఉండి ప్రజా సమస్యల మీద పోరాడాలి అన్న భావన ఉండాలి. ప్రజలతో మమేకమై ఎప్పుడు వారి మధ్య తిరగడం నా ఆశ ఆశయం ఉండాలి.. అవి ఉంటే ఈ తరహా రోడ్డుమీదే యువతను ప్రోగు చేసి కొత్త తరహా రాజకీయాలు చేయవచ్చు. దీనికి డబ్బుతో పని లేకున్నా ఓపిక ఓర్పు మార్పు తెచ్చే కసి ఉండాలి. దీన్ని ముందుకు సాగించాలన్న తాపత్రయం కనిపించాలి.
** స్వాతంత్ర సమరంలో మొదట పాలు పంచుకున్న సమయంలో గాని, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తన యాత్ర మొదలు పెట్టినపుడు, బిఎస్పీ మొదలు సమయంలో కాన్షిరాం, తెలుగుదేశం పార్టీ ప్రారంభం సమయంలో ఎన్టీఆర్ సైతం ఇలా రోడ్డు మీద జనాన్ని ప్రోగు చేసి వారితో మమేకమయ్యారు. అంత పెద్ద వారితో పవన్  పోల్చడం సరి కాదు కానీ ప్రస్తుతం పవన్ అనుసరిస్తున్న ఈ తీరు సర్వదా హర్షణీయమే.
** ప్రస్తుతం జనసేన పార్టీ తన ఉనికి కోసం ఆరాటపడుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కు విశేష జనాదరణ ఉన్న దాన్ని ఓట్లుగా మలుచుకో లేకపోయారు. మరోపక్క పార్టీ నేతలు సైతం పార్టీ జనంలో ఉండకపోతే కష్టం అంటూ ఇటీవల పార్టీ సమావేశంలోనే నిర్మొహమాటంగా చెప్పారు. దీంతోనే పవన్ ఆలోచన తీరు మారినట్లు కనిపిస్తోంది. ప్రతి పర్యటనలోనూ యువతను ఎక్కువగా కలుసుకునే పవన్ ఇకమీదట ఇలా ప్రత్యక్షంగా కలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుఫాను వచ్చినప్పుడు పర్యటనకు వెళ్లిన పవన్ ఆ సమయంలోనూ ఇదే తీరున కొంతమంది యువత రోడ్డు పక్కన పోగేసి వారి మధ్యలో తాను కూర్చొని మాట్లాడిన విషయం పాతదే. అయితే అదే తీరును తర్వాత పవన్ కొనసాగించలేకపోయాడు. కేవలం సమావేశాలు, సభ్యులతోనే కాలం గడిచిపోయింది. అయితే ప్రస్తుతం మళ్లీ ఆయన ఆలోచనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

pawan kalyan

కొనసాగిస్తారా?

నివర్ తుఫాను ప్రభావ ప్రాంతాల్లో పర్యటన ను పవన్ పార్టీ కార్యకర్తలను కలుసుకునేందుకు ఉపయోగించుకున్నారు. ఇదే తీరును ఆయన కొనసాగిస్తే పార్టీకి మంచి రోజులు మొదలైనట్లే. కార్యకర్తలతో మాట్లాడే సమయంలో సైతం ఆయన దిశానిర్దేశం పెరగాలని కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్న తీరుగానే ఆయన ప్రసంగం ఉంటుందనేది మరో ఆరోపణ. దీని సైతం పవన్ అధిగమించి, ఇదే పరిస్థితిలో ప్రజల్లో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసి కమిటీలు నియమిస్తే జనసేన ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఎదగడమే కాకుండా, కొత్త తరహా రాజకీయాలతోనే యువతను, తాటస్థులను తన వైపు తిప్పుకోవడం ఖాయం.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju