Krishna Mukunda Murari:కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో ఒక మంచి పాత్రతో మనందరికీ పరిచయమైన ముకుంద.తన అసలు పేరు యశ్మీ గౌడ. ఈమె పుట్టింది బెంగళూరులో 1995 ఆగస్టులో జన్మించింది. చిన్నతనం నుంచి సినిమాలు చూస్తూ పెరిగిన ముకుంద చిన్నతనంలోనే మోడలింగ్ పై దృష్టి పెట్టింది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. తను చిన్నతనంలోనే సినిమాల మీద మక్కువ ఉండేది కానీ ఇంట్లోప్రోత్సాహం లేకపోవడంతో ముందు మోడలింగ్ రంగంలోనికి అడుగు పెట్టింది.

మెల్లిగా ఆమెకిసీరియల్స్ లోఅవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇంట్లో వాళ్ళు వద్దన్నా తను పట్టుదలతో సీరియల్ ఆడిషన్స్ జరుగుతుండగా వెళ్ళింది. అనుకోకుండా కన్నడంలో ఒక మంచి సీరియల్ లో తన కెరియర్ ప్రారంభమైంది. ఆ సీరియల్ లో తనకి పేరుతో పాటు మంచి మంచి అవకాశాలే వచ్చాయి. అలా అవకాశం దక్కించుకోని తెలుగులో మొదటిసారిగా” స్వాతి చినుకులు”సీరియల్లో అందరికీ పరిచయం అయింది. తెలుగులో సీరియల్ అంటే ముందు భయపడిన తర్వాత తెలుగు కన్నడ రెండు భాషల్లోనూ అనర్గళంగా అవకాశాలను అందిపుచ్చుకుంది.

హైదరాబాదులో ఉంటూ తెలుగులో సీరియల్స్ లోనూ బెంగళూరులో కొన్ని రోజులు ఉంటూ కన్నడ సీరియల్స్ను రెండిటిని తోబుట్టు లాగా భావిస్తూ సీరియస్ చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ”నాగభైరవి” సీరియల్ లో జీ తెలుగులో ప్రసారమయ్యే దాంట్లో భైరవి పాత్రలో అద్భుతంగా నటించి ఎక్కువమంది అభిమానుల్ని సంపాదించుకుంది. యశ్మీ గౌడ ”త్రినయని”సీరియల్ లో కూడా అతిధి పాత్రలోమెప్పించింది.ఆ తరువాత వచ్చిన సీరియల్ ” కృష్ణా ముకుందా మురారి” ఈ సీరియల్లో ముకుంద అనే క్యారెక్టర్లో జీవించేస్తుంది యశ్మీ గౌడ. ప్రేమ గొప్పతనాన్ని నిరూపించే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సీరియల్ కృష్ణా ముకుందా మురారి.

ఈ సీరియల్ స్టార్ మా లో మంచి పిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ తో వచ్చిన గుర్తింపు వల్ల ఇంట్లో వాళ్ళు కూడా తనని అర్థం చేసుకున్నట్టుగా ముకుంద ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. బయటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నల ముందు ఎవరైనా సెల్ఫీ అడిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.అలానే ఈ సీరియల్ ఇంత మంచిగా గుర్తింపు వస్తుందని ఏ రోజు అనుకోలేదు ఈ సీరియల్ తో తెలుగులో కూడా నాకు మంచిపట్టు వచ్చింది.

అని ఒక ఇంటర్వ్యూలో యశ్మీ గౌడ చెప్పింది. మొదటి అడ్డు చెప్పినా తర్వాత అమ్మానాన్నలు సపోర్ట్ చేస్తున్నారని ఇంట్లో అందరికంటే ముందే నా సీరియస్ చూస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది. ఇక ముకుంద కూడా ఎప్పుడూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది సోషల్ మీడియా ద్వారా, ప్రతిరోజు తన లైఫ్ లో జరిగే, ఫ్రెండ్స్ తో జరిగే పార్టీని ప్రతిదీ అభిమానులతో పంచుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది ముకుంద. అలాగే ఇప్పుడు కూడాఒక వెస్ట్రన్ డ్రెస్ లో, లంగా వోణీలోరెండు విభిన్నమైనడ్రెస్సింగ్ తో ఫోటోలను షేర్ చేసింది ముకుంద. ఇప్పుడు ఈ ఫొటోస్ ను అభిమానులు లైక్ షేర్ తోవాళ్ళ ఆనందాన్ని తెలుపుతున్నారు.ఇప్పుడు ఆ ఫొటోస్ ను మీరు చూసేయండి.