Samantha: ప్రస్తుతం టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత మంచి స్వింగ్ లో వుంది. కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టి వరుస హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలో ‘యశోద’ అనే సినిమా చేసింది. శ్రీదేవి మూవీ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. హరీష్ శంకర్ హరీష్ నారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సామ్ డిఫరెంట్ రోల్లో అలరించబోతోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది.
Samantha : ఇది నిజమేనా…ఎన్నాళ్లకు సామ్ చైతూ ఫోటో పెట్టిందో.?
Samantha: అక్కినేని అన్నదమ్ములు vs సామ్?
ఇకపోతే సరిగ్గా అదే రోజు అఖిల్ అక్కినేని యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ఏజెంట్’ రిలీజ్ కాబోతుంది. అలాగే అమీర్ ఖాన్ నాగ చైతన్య కలిసి చేసిన హిందీ మూవీ ‘లాల్ సింగ్ చద్ధా’ అనే సినిమా కూడా అదేరోజు రిలీజుకి వుంది. అయితే ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు ఎప్పుడో అనౌన్స్ చేశారు. దీంతో సమంత కావాలనే అక్కినేని అన్నదమ్ములకు పోటీగా దిగుతోందనే ప్రచారం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అయితే ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సమంతకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారట.
Samantha: సామ్ బాలీవుడ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? టాలీవుడ్ ని పూర్తిగా విడిచి పెడుతుందా?
చిరు vs సామ్?
మన మెగాస్టార్ ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ అనే మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘లూసిఫర్’కు అఫీషియల్ రీమేక్. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిరుకి బాడీగార్డ్ గా చేస్తున్న విషయం తెలిసినదే. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్ ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఈ వార్తే నిజమైతే.. సమంతకు బిగ్ షాక్ తగిలినట్టే అవుతుంది మరి.