మంత్రి.. హీరోయిన్ : కొన్ని చీకటి వాస్తవాలు..! “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!!

ఒక మంత్రిగారు..! ఒక చిన్నపాటి హీరోయిన్ ని కెలికారు. ఆమెతో వాట్సాప్ చాట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఒక బ్యూటీషియన్ ద్వారా ఆ హీరోయిన్ కి వల వేసి రూమ్ కి రప్పించుకునె ప్రయత్నం చేశారు. ఆ హీరోయిన్ ఒప్పుకోలేదు, ఈ మంత్రి గారి రాసలీలలను బయటపెట్టింది..! ఇదీ ఈరోజు పొద్దున్న నుండి ఓ టీవీ ఛానెల్ లో ఈ అంశంపై కథనాలు తెగ తిరుగుతుంది. సదరు ఛానెల్ వరుసగా సిరీస్ కథనాలు వేస్తుంది. ఈ అంశంలో ఆ కథనాలకు, వారి వాదనలకు, అసలు విషయానికి అతుక్కునే కొన్ని కీలకమైన పాయింట్లు ఈ కథనంలో చెప్పుకుందాం..!!

భిన్న వాదనలు వస్తున్నాయి..!!

మంత్రిగారి ఈ రాసలీలల అంశంపై కొన్ని భిన్నమైన వాదనలు ఉన్నాయి. వాటిని ఓ సారి పరిశీలించాల్సిందే. ఆ తర్వాత ఎవరి లాజిక్కులు, ఎవరి కామన్ సెన్స్ తో ఆలోచిస్తే సరిపోతుంది.

Minister Heroine Affair

* ఆ కథనాలను ప్రసారం చేస్తున్నది టెన్ టీవీ. అంటే టీఆరెస్ జేబు సంస్థ ఇది. అంటే టీఆరెస్ కి, కేసీఆర్ కి తెలియకుండా ఆ పార్టీ ఎమ్మెల్యే, ఆ ప్రభుత్వ మంత్రిపై ఇటువంటి వరుస కథనాలు వేస్తుందా..? అనేది ఒక పెద్ద ప్రశ్న..!! సో.., పార్టీ పెద్దలకు తెలిసి, ప్రభుత్వ సహకారంతోనే వేస్తుంది అని అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో కొత్తగా మంత్రివర్గంలోకి కేసీఆర్ కుమార్తె కవితని తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ బెర్తు ఖాళీ లేదు. అందుకే ఇలా ఒక మంత్రికి చెందిన స్కాండిల్ బయటపెడితే ఆయనను రాజీనామా చేయిస్తే కవితకు సులువవుతుంది అనేది ఓ వాదన. (దీనిలో మనం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే టీఆరెస్ పెద్దలకు, ప్రభుత్వానికి తెలియకుండా ఆ ఛానెల్ కథనాలు ప్రసారం చేయదు అనేది ఎంత వాస్తవమో.., కవితని మంత్రిని చేయడానికి ఇలా ఒక బీసీ మంత్రిని కేసీఆర్ బలి చేస్తే తనకు వచ్చే అపవాదుని కేసీఆర్ ముందే గ్రహిస్తారు అనేది కూడా అంతే నిజం..!)

 

Minister , Heroine Watsapp chat

* ఇది సాధారణ స్కాండిల్ కాదు అనీ.., దాదాపు 100 మంది నాయకులు.., అధికారులు దీనిలో భాగస్వాములుగా ఉన్నారు. సీబీఐ విచారణ జరిపిస్తే టీఆరెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం..! అనేది మరో వాదన. ఇది ప్రతిపక్షాలు, మీడియా గ్రూపుల్లో బాగా తిరుగుతున్న వార్త. (దీనిలో కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఆ స్థాయిలో నూరులో 90 మందికి చీకటి బతుకులు, సెక్స్ స్కాండిల్స్ ఉంటాయి. ఎవరి బాగోతాలు వారివి. సో.., నిజం కావచ్చు. కానీ ఇదే నిజమైతే టీఆరెస్ అనుబంధ ఛానెల్ లో ఎందుకు ఈ కథనాలు ప్రసారం చేస్తారు..? ఒక్కరినే ఎందుకు టార్గెట్ చేస్తారు..!?)

* ఇక ఆ ఛానెల్ ప్రసారం చేస్తున్న కథనాల్లో దమ్ము లేదు. సరైన ఆధారాలు మాత్రం లేవు. కేవలం వాట్సాప్ చాట్స్ మాత్రమే ఉన్నాయి. ఆయన మసాజ్ చేయమన్నారు అని.., ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది అని కథనాల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని ఎంతవరకు విశ్వసించగలరు..? వాట్సాప్ చాట్స్ నమ్మశక్యం కాదు. అయితే ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగితే మాత్రం రహస్యంగా సాగుతుంది, తప్ప కేవలం ఒకే ఛానెల్ కి ఇవి ఉప్పు అందివ్వరు అనేది ఒక వాదన. (ఈ పాయింట్ ని కూడా కాస్త లోతుగా ఆలోచించడానికి ఏమి లేదు. ఇది ఒక ముందస్తు ప్రణాళికగా తెలంగాణాలో పేలనున్న ఒక పెద్ద రాజకీయ బాంబుగా చెప్పుకోవచ్చు. ఆమె బయటపెట్టిన వాట్సాప్ చాట్స్ లో పేర్లు ఒక చోట జీకే అని ఉండడం.., ఓ చోట జీపీ అని ఉండడం..!! ప్రొఫైల్ ఫోటోలు వేరుగా ఉండడం కొన్ని సందేహాలకు తావిస్తుంది. చూద్దాం..!!) ఈ అంశంపై మరిన్ని వాదనలు, వాస్తవాలు, చీకటి కోణాలు, అప్డేట్స్ చెప్పుకుందాం..!!