హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ ఆదాశర్మ. అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఈమె విద్యుత్జమ్వాల్తో కలిసి `కమాండో 3` చిత్రంలో నటిస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఆదాశర్మ యాక్షన్ సీక్వెన్స్‌ల్లో ప్రత్యేకమైన శిక్షణను తీసుకుంది. అందులో భాగంగా సిలంబాట్టమ్ను నేర్చుకుంది. సిలంబాట్టమ్ అంటే కర్రసాము. ఇప్పుడు ఆదాశర్మ సిలంబాట్టమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆదా చేస్తున్న సిలంబాట్టమ్ ఫీట్‌ను చూసిన అభిమానులు ఆమెకు మరింతగా ఫిదా అవుతున్నారు.