RRR: జపాన్ దేశంలో రజనీకాంత్ కి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. రజిని సినిమా విడుదలైందంటే చాలు జపాన్ వాసులు పండగ చేసుకుంటారు అంతగా రజనీకాంత్ ను ఇష్టపడతారు. ఈ క్రమంలో 1995లో.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “ముత్తు” జపాన్ దేశంలో అప్పట్లోనే 400యోన్ లు అనగా 3.6 మిలియన్ డాలర్ లు. మన రూపాయి భాషలో 24.14 కోట్లు కలెక్షన్ కాబట్టి జపాన్ దేశంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. జపాన్ లో “ముత్తు’ క్రియేట్ చేసిన ఈ రికార్డుని 24 సంవత్సరాలుగా ఎవరూ కూడా టచ్ చేయలేకపోయారు.
అటువంటిది అక్టోబర్ నెలలో జపాన్ దేశంలో “RRR” విడుదల చేయగా అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేయడం జరిగింది. జపాన్ దేశంలో మొత్తం సినిమా కంటే అధికమైన కలెక్షన్లు సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి దూసుకుపోతుంది. ఈ ఒక్క రికార్డు మాత్రమే కాదు అత్యధిక ఫుట్ ఫాల్స్ సాధించిన ఇండియా సినిమాగా కూడా అరుదైన ఘనత సాధించింది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన RRR ఇండియాలో ₹1200 కోట్లు కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు అద్భుతంగా నటించారు.
బాలీవుడ్ , హాలీవుడ్ నటులు కూడా నటించడం జరిగింది. ఇండియాలో రెండు సార్లు 1000 కోట్లు మార్కెట్ చేసిన ఏకైక దర్శకుడుగా రాజమౌళి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంక అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి మూడు ప్రతిష్టాత్మకమైన అవార్డులు లభించాయి. ఆస్కార్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి దారుణంలో జపాన్ దేశంలో అత్యధికమైన కలెక్షన్ సాధించిన ఇండియన్ సినిమాగా RRR సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ప్రపంచ సినిమా రంగాన్ని కుదిపేసిన RRR… సీక్వెల్ కి అవకాశాలు ఉన్నట్లు ఇటీవల రాజమౌళి తెలిపారు. ఎందుకు సంబంధించి స్టోరీ పనులపై కూడా వర్క్ జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో “RRR 2” కూడా రావాలని అభిమానుల ఆశిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబు సినిమాపై దృష్టి పెట్టడం జరిగింది. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో ఈ సినిమాకి సంబంధించి ప్రకటన రానున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!