Acharya: మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ”ఆచార్య” రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా తాజాగా ‘ఆచార్య” సినిమా ధర్మస్థలి అనే టెంపుల్ టౌన్ సెట్ కి సంబంధించినటువంటి వీడియో రిలీజ్ చేసారు. ప్రస్తుతం అది యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ వీడియో చూస్తేనే మనకు అర్ధం అవుతుంది.. సినిమా మొత్తం ధర్మస్థలి బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా జరుగుతుందని. అయితే దీని కోసం ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్ పర్యవేక్షణలో.. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మించారట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Acharya: ఇండియాలోనే అతిపెద్ద సెట్?
తాజాగా మన మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో ద్వారా ఈ సెట్ గురించి వివరిస్తూ… ”ఆచార్య సినిమా కోసం కోకాపేటలో ఓ అద్భుత టెంపుల్ టౌన్ ని నిర్మించాం. ఇది బహుశా ఇండియాలోనే అతి పెద్ద సినిమా సెట్ గా చెప్పుకోవచ్చు. కొరటాల శివ స్టోరీ చెప్పినప్పుడు.. ఓ పవిత్రమైన పురాతన దేవాలయం, చుట్టూ కొండలు, పక్కనే నది, ఆ పక్కనే పల్లె జనానికి సంబందించిన గూడేలు.. ఉండే ఓ ఐడియా చెప్పారు. కానీ ఇవన్నీ కలిసుండే లొకేషన్ ప్రస్తుతం ఎక్కడ కూడా దొరకదనే భావనతోనే ఓ మాట అనుకొని, అచ్చం అలాంటి ప్రాంతాన్ని పోలి వుండే కోకాపేటలో ఈ టెంపుల్ టౌన్ సెట్ ను నిర్మించడం జరిగింది” అని చిరంజీవి తెలిపారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరింత సమాచారం
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అనుకున్నదే తడవుగా 20 ఎకరాల్లో భారీ సెట్ నిర్మాణం జరిగింది. ఇందులో అగ్రహాలు, పెద్ద పెద్ద మండపాలు, గాలి గోపురాలు, ఒక పెద్ద దేవీ విగ్రహం, గూడేలు చూసి నిజంగా చాలా థ్రిల్ గురయ్యాను. ఇదే ఒకవేళ రియలిస్టిక్ లొకేషన్ కు వెళ్లి చేయాలి అనుకుంటే.. ‘ఆచార్య’ సినిమా ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉండేది. ఈ సెట్ ఇంత అద్భుతంగా రావడానికి ప్రొడక్షన్ డిజైనర్ అయినటువంటి సురేష్ కారణం. ఇండియాలో ఒక సినిమా కోసం 20 ఎకరాల విస్తీర్ణంలో వేసిన బిగ్గెస్ట్ సెట్ కేవలం ఇది మాత్రమే!” అని చిరు ఈ వీడియోని ముగించాడు. ఇకపోతే ఇంతకుముందు దర్శకుడు కొరటాల శివ కూడా టెంపుల్ టౌన్ సెట్ గురించి వివరించి చెప్పడం మనం చూసాం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!