Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011లో “ఏ మాయ చేసావే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు పడటంతో అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్ గా అవతరించింది. వ్యక్తిత్వ పరంగా సమంత చాలా మంచిదని అందరికీ తెలుసు. తన జీవితంలో ఎలాంటి చేదు సంఘటనలు జరిగిన సమాజంలో ఇతరులకు మంచి చేయడంలో ముందుంటది. ఇదే సమయంలో తోటి నటీనటుల పట్ల కూడా సమంత మంచిగా మెలగడం జరుగుద్ది. ఈ రకంగానే “రంగస్థలం” సినిమా సమయంలో నటుడు నాగ మహేష్ పట్ల సమంత.. ఓ సీన్ చేస్తున్న సమయంలో.. చాలా సహాయపడినట్లు అతను ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేశారు.
పూర్తి విషయంలోకి వెళ్తే 2018వ సంవత్సరంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన “రంగస్థలం” టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. నటుడిగా రామ్ చరణ్ కి “రంగస్థలం” మంచి పేరు తీసుకురావడం జరిగింది. చిట్టిబాబు పాత్రలో చెవిటివాడిగా చరణ్ నట విశ్వరూపం చూపించాడు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సినిమాలో చాలా హైలెట్ గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో పొలిటికల్ స్టోరీ తో.. ఎమోషనల్ రివెంజ్ డ్రామా తరహాలో చిత్రీకరించారు. సమంత హీరోయిన్ గా నటించింది. 2018 మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాగ మహేష్ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవితో నటించిన “ఖైదీ నెంబర్ 150” సినిమా వలన “రంగస్థలం” సినిమాలో అవకాశం వచ్చినట్లు స్పష్టం చేశారు. అయితే రంగస్థలం లో ఒక సీన్ లో భాగంగా హీరోయిన్ సమంత చేయి పట్టుకుని… గట్టిగా లాగవలసి ఉంటుంది. అయితే సమంత పెద్ద హీరోయిన్ కాబట్టి నేను చెయ్యి మామూలుగానే పట్టుకొని అలా ఉంటే… సమంతయే.. సన్నివేశానికి తగ్గట్టు ఏం పర్లేదు సార్.. మీరు గట్టిగా చేయి పట్టుకుని లాగండి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఆ సన్నివేశం చేస్తున్న సమయంలో ఆమె ఎంతగానో సహాయం చేసింది. సినిమాలో ఆ సీన్ చాలా బాగా వచ్చింది. అందుకే ఆ సినిమా అంత విజయం సాధించింది అంటూ సమంత మంచితనాన్ని నాగ మహేష్ బయట పెట్టడం జరిగింది.