Allu Arjun Triumphs At Nationals: నేడు ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. జాతీయస్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి విజేతలు హాజరయ్యారు. అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. “పుష్ప” సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు కింద బన్నీకి ఓ జ్ఞాపిక, ప్రశంస పత్రం కూడా బహుకరించారు.
తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్తమ జాతీయ అవార్డును అందుకున్న మొట్టమొదటి హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. దీంతో అవార్డు తీసుకుంటున్న సమయంలో రాష్ట్రపతి భవన్ చప్పట్లతో మారుమోగిపోయింది. అంతకుముందు బన్నీ అవార్డుల కార్యక్రమం వద్ద జాతీయ మీడియాతో మాట్లాడారు. జాతీయ అవార్డు అందుకోవటం ఎంతో ఆనందం కలిగిస్తుందని తెలిపారు. “పుష్ప” ఓ కమర్షియల్ చిత్రమని అలాంటి చిత్రానికి జాతీయ అవార్డు అంటే నిజంగా డబుల్ అచీవ్మెంట్ అని స్పష్టం చేశారు. మొత్తం ఇంగ్లీషులో మాట్లాడి చివరిలో ఏమన్నారంటే ఈ ఒక్క మాట మాత్రం నా మాతృభాషలో చెబితే నాకు బాగుంటుంది అంటూ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పారు.
ఇంకా ఈ జాతీయ అవార్డుల వేడుకలో ఉత్తమ తెలుగు చిత్రంగా “ఉప్పెన” ఎంపిక కావటంతో డైరెక్టర్ బుచ్చిబాబు సన నిర్మాతలు అవార్డులు స్వీకరించనున్నారు. ఇదే సమయంలో “RRR” కి రాజమౌళి, “దీ కాశ్మీర్ ఫైల్స్” చిన్న సినిమాకు నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డులు తీసుకొనున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో “RRR”కి ఆరు పురస్కారాలు లభించాయి. “పుష్ప”కి రెండు పురస్కారాలు దక్కాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!