Amrita AIyer: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బేబచ్చమైన పాపులారిటీ సంపాదించుకోకపోయినా కొద్దో గొప్పో పాపులారిటీ పొందింది అమృత అయ్యర్. మొదట్లో ఈమె విజిల్ వంటి సినిమాలలో కనిపించి సూపర్ హిట్ విజయాలు అందుకున్నప్పటికీ ఈమె గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు.
కానీ ప్రస్తుతం మాత్రం అమృత అయ్యర్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే.. 2024 సంక్రాంతి బరిలో హనుమాన్ మూవీతో రంగంలోకి దిగిన ఈ ముద్దుగుమ్మ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్ పాపులారిటీ కూడా దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి వరుస సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సెలబ్రిటీలు తమ అందాన్ని సినిమాలో ఎంత ఆరబోస్తారో అంతకుమించి సోషల్ మీడియాలో ప్రదర్శిస్తారు.
కొందరు పద్ధతి అయిన డ్రెస్సులలో ఆకర్షిస్తే మరికొందరు పొట్టి పొట్టి బట్టలలో ట్రీట్ ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా పట్టుచీరను ధరించి చిన్నపాటి నవ్వుతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అమృత అయ్యర్. చీరను ఎంతో సాంప్రదాయంగా కట్టి సింపుల్ జ్యువలరీ ధరించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.
ఈ వీడియోను చూసిన పలువురు..” అందరు హీరోయిన్లు ఇలా పద్ధతిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఒకరేమో బట్టలు వేసుకోవడానికి సిగ్గుపడతారు. మరొకరేమో ఎంతో సాంప్రదాయంగా రెడీ అవుతారు. వీరి టేస్ట్ ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఏది ఎలా ఉన్నా పట్టు చీర కట్టుకుని సాంప్రదాయంగా ఉన్న వారికి పెద్దగా సినిమా అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రారు డైరెక్టర్లు. అందువల్లే హీరోయిన్లు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ తిరుగుతారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.