Ananya Panday: సినీ నటుడు చుంకీ పాండే ముద్దుల కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనన్య పాండే.. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2`తో తొలిసారి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అనన్యకు సూపర్ క్రేజ్ దక్కింది. ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `లైగర్` మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది.
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా కంటే ముందే అనన్య `గెహరియాన్` అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్య ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో కేకపెట్టిస్తుంది.
అయితే ఈ సారి స్విమ్మింగ్ పూల్‌లో అందాలు ఆరబోసిందీ బ్యూటీ. వైట్ బికినీ ధరించిన అనన్య.. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి వాటర్‌లో పోజులిచ్చింది. ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తన ఫాలోవర్స్‌కు సూపర్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం మైండ్‌బ్లాక్ చేస్తున్న అనన్య తాజా పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Doobey…. playing in the background….
.
.#AnanyaPanday pic.twitter.com/3bnwUyHFQL— Bollywood Buzz (@CricBollyBuzz) February 17, 2022
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!