Rashmi: యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఫేమ్ పొందిన వారిలో రష్మీ ఒకరు. ఈమె యాంకరింగ్ తో ముద్దు ముద్దు మాటలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది. అంతేకాకుండా పలు ట్రోల్స్ కి కూడా గురవుతుంది.
సుధీర్ తో లవ్ అనే స్క్రిప్ట్ ని నడిపి ఎన్నో షోలని సక్సెస్ చేసింది రష్మీ. ఇక దీంతో వీరిద్దరిపై ట్రోల్స్ మొదలయ్యాయి. వాటిపై వీరిద్దరు స్పందించినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగలేదు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులు సైతం షేర్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరైనా జంతువులను హింసిస్తే ఈమెకి అస్సలు నచ్చదు.
ఎందుకంటే ఈమె ఓ జంతు ప్రేమికురాలు. అయితే బక్రీద్ పండగ నాడు ముస్లింలు సాంప్రదాయంలో భాగంగా చేసే జంతు బలులను ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించింది. దీంతో ట్రోలర్స్ ఈమెపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా దీనిపై రష్మీ ఓ ట్రీట్ ద్వారా స్పందించింది.
అయోధ్య రామ మందిర్ విగ్రహ ప్రతిష్టాపన వేల ఒక పోస్టర్‌తో ట్రోలర్స్ ని రెచ్చగొట్టింది. ” ట్రోలర్స్ కి సమాధానం చెప్పే సమయం నా దగ్గర లేదు. నేను కాషాయ రంగు చీర సిద్ధం చేసుకున్నాను. దీపాలు వెలిగించాలి. ఇకపై ఏడాదికి రెండు దీపావళిలు. రాముడు మరియు సీత తిరిగి ఇంటికి వచ్చేసారు. జైశ్రీరామ్ ” అంటూ రాసుకు వచ్చింది. ఇక ఈమె ట్రీట్ పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
So many tweets
Sorry haters can’t respond now
Busy prepping for Tom
Getting my saffron saree ready for the big day
Aab se diwali saal mei do baar
Deep 🪔 jalao
Ram ji Sita maa ghar vapas aa rahe hai #JaiSiyaRam #Harekrishna #HaarHaarMahadev— rashmi gautam (@rashmigautam27) January 21, 2024
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!