Sai Pallavi: నాచురల్ స్టార్ గా పేరుగాంచిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక మన టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు అడుగుపెట్టినప్పటికీ సాయి పల్లవి ప్లేస్ ని మాత్రం ఎవ్వరు రీప్లేస్ చేయలేరు.
అదేవిధంగా ఈమెకి స్టార్ హీరోల మనసులో ఉన్న ప్లేస్ ని కూడా ఎవ్వరూ తొలగించలేరని చెప్పొచ్చు.
ఎంతో గౌరవం మరియు పద్ధతితో కూడిన ప్లేస్ ని సాయి పల్లవికి ప్రతి ఒక్కరు ఇస్తారు. ఇక ఆ ప్లేస్ ని సాయి పల్లవి సైతం ఎంతో బాగా కాపాడుకుంటుంది. సహజంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయాల్సిన రంగం. కానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేను ఆ క్యారెక్టర్ చెయ్యను ఈ క్యారెక్టర్ చేయను అంటే కుదరదు.
పైకి ఎంతో డీసెంట్‌గా ఉన్నప్పటికీ సినిమాలలో మాత్రం బోల్డ్ గానే చూపించాలని అనుకుంటారు డైరెక్టర్లు. అదేవిధంగా సాయి పల్లవి మాత్రం అటువంటి క్యారెక్టర్లలో చేయనని మొండికేసి చెబుతుంది. సహజంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం రామాయణం వంటి కథలను తీస్తుంటే చూడడం లేదు.. రామాయణం పదులు రొమాన్స్ అనే టైటిల్ పెట్టడంతో ఆ సినిమా 100 కోట్లు ఏంటి 1000 కోట్ల కలెక్షన్స్ ని కూడా రాబడుతుంది.
ఇక అలా ఉన్న మన సినిమా ఇండస్ట్రీ లో సాయి పల్లవి నేను ఎంతో పద్ధతి అయిన పాత్రలు చేస్తా ఆ డ్రెస్ వేసుకోను ఈ డ్రెస్ వేసుకొను అంటే ఇంకొన్ని రోజుల్లో ఈమెకి పూర్తిగా అవకాశాలే ఉండవని చెప్పొచ్చు. ఇప్పటికే అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కి రానున్న రోజుల్లో ఒక్క అవకాశం కూడా రాదు. ఇక ఇది సాయి పల్లవి కెరీర్ కి పెద్ద డ్యామేజ్ అనే చెప్పొచ్చు. ఏదేమైనా సాయి పల్లవి పద్ధతిగా ఉండడం తప్పు కాదు.. కొన్ని సినిమాలలో మరీ ఎక్కువగా కాకపోయినా మీడియం రొమాన్స్ సీన్స్ లో నటించడం ద్వారా అయినా అడపాదడపా సినిమాలు దక్కుతాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!