Bala Krishna : నందమూరి బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు అని అందరికీ తెలుసు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్, సింహా సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేయడం అందరికీ తెలిసిందే. నందమూరి బాలయ్య బాబు ను నందమూరి ఫాన్స్ ఏ విధంగా చూడాలి అని అనుకుంటారో వాళ్ళ పల్స్ రేట్ సరిగ్గా తెలుసు అన్న రీతిలో బోయపాటి… స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. పైగా బోయపాటి కూడా నందమూరి ఫ్యామిలీ అభిమాని కావడంతో… నందమూరి ఫ్యామిలీ హీరోస్ తో తీసిన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్యబాబు వరుస ఫ్లాపుల్లో ఉన్న క్రమంలో… ఎలాగైనా ఈసారి బోయపాటి యే బాలయ్య బాబు ని మళ్లీ హిట్ ట్రాక్ లోకి తీసుకురావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన చిన్నపాటి టీజర్ అదేవిధంగా పోస్టర్లు ఫ్యాన్స్ నీ ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా సినిమాపై అంచనాలు కూడా పెంచడం జరిగింది. దీంతో సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Bala Krishna బాలయ్య బాబు బోయపాటి సినిమాకి
అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య బాబు బోయపాటి సినిమాకి సంబంధించి సీడెడ్ హక్కులు బెళ్లరీ సాయి 12 కోట్లకు… దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నైజాం రైట్స్ రికార్డ్ స్థాయిలో రేట్లు పలికే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఇదిలా ఉంటే సినిమాలో మూడు సరికొత్త పాత్రలో బాలయ్య బాబు కనువిందు చేయనున్నట్లు … అందుకోసం బాలయ్య బాబు తనని తాను సరికొత్తగా మలుచు కున్నట్లు ఇండస్ట్రీ టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!