సినిమాల్లో హీరోయిజం, ఫైట్లు, డ్యాన్సులు వేసే హీరోలకు అభిమానులే శ్రీరామ రక్ష. అభిమానుల కేరింతలు, ఈలలు, చప్పట్లు, సంబరాలతో హీరోలు ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. సినిమా ప్రారంభం నుంచి అంచనాలు, సినిమా రిలీజ్ కు ధియేటర్ల వద్ద హడావిడి, హౌస్ ఫుల్ బోర్డులు, కలెక్షన్ల లెక్కలు.. మొత్తంగా తమ హీరోను వెండితెర ఇలవేల్పుగా తమ భుజాలపై మోస్తారు. తమ ఎదుగుదలకు ఇంతగా కారణమైన ఫ్యాన్స్ ను అత్యవసర సందర్భాల్లో ఆదుకుంటూ అక్కున చేర్చుకుంటారు కూడా. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలోనే ఉంటారు. చిరంజీవి తన అభిమానికి చేసిన సాయమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
మహబూబాబాద్ కు చెందిన బోనగిరి శేఖర్ మెగాస్టార్ కు వీరాభిమాని. దశాబ్దాలుగా చిరంజీవిని అభిమానిస్తున్నాడు. మిర్చిబండి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు శేఖర్. ఆయనకు ఇద్దరు కుమార్తెలు వర్ష, నిఖిత ఉన్నారు. ఈక్రమంలో శేఖర్ తన పెద్ద కుమార్తె వర్షకు పెళ్లి చేస్తున్నాడని తెలుసుకుని చిరంజీవి తన వంతు సాయంగా లక్ష రూపాయలను అందించారు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు స్వయంగా వెళ్లి చిరంజీవి అందించిన సాయాన్ని చెక్కు రూపంలో శేఖర్ కు అందించారు. నిహారిక పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి అభిమాని కుమార్తె పెళ్లికి సాయం చేయడంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 19న వర్ష పెళ్లి జరగబోతోంది.
శేఖర్ 30 ఏళ్లుగా చిరంజీవికి అభిమానిగా ఉంటున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నాడు. తన కోసం ఇంత అభిమానం చూపే అభిమానుల కోసం చిరంజీవి సాయం చేస్తూనే ఉంటారు. లాక్ డౌన్ సమయంలో గుంటూరుకు చెందిన మహిళా అభిమానికి గుండె ఆపరేషన్ ను హైదరాబాద్ రప్పించి అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించారు. తన వీరాభిమాని సికింద్రాబాద్ కు చెందిన నూర్ మహ్మద్ మృతి చెందితే ఆయన కుటుంబానికి 10 లక్షల సాయం చేశారు. ఇప్పుడు అభిమాని కుమార్తె పెళ్లికి సాయం చేయడం మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!