కొరటాల శివ.. కమర్షియల్ సినిమాలకి కొత్త హంగులు అద్ది మంచి మెసేజ్ ని కూడా అందరికీ అర్ధమయ్యేలా, అందరూ చూసేలా, అందరికీ నచ్చేలా తీయడంలో సిద్ధహస్తుడు. మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన భరత్ అనే నేను వరకు కొరటాల చేసినవి అన్నీ కమర్షియల్ గా సక్సస్ అయిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే.. పైగా ఒకదాన్ని మించి ఇంకొకటి హిట్ అవ్వడం విశేషం
జనతా గ్యారేజ్ సినిమాలో జనం కోసం బ్రతకాలని చెప్పిన కొరటాల శివ.. భరత్ అనే నేనుతో అందరూ బాధ్యతగా ఉండాలని చెప్పాడు. ఈ సినిమాతో 200 కోట్లు కొల్లగొట్టిన శివకి ఇప్పటి వరకు ఫ్లాప్ అనేదే తెలియదు… అలాంటి డైరెక్టర్ తో మెగాస్టార్ చిరు సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం సైరా చేస్తున్న చిరు, ఇది అయిపోగానే కొరటాలతో సినిమా ఒప్పుకున్నాడు, దీనికి సంబంధించి కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా సైరా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది.
చిరూ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన కొరటాల శివ ఇందులో చిరూని డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నాడు. పదేళ్ల గ్యాప్ తీసుకొని కూడా రీఎంట్రీతో బాక్సాఫీస్ లెక్కలు మార్చిన చిరుకి అపజయమే ఎరుగని కొరటాల కలిస్తే మరోసారి కాసుల వర్షం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ చిరంజీవి-కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఉగాదికి గ్రాండ్ గా లాంచ్ అవుతుంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!