Chiranjeevi 154: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోల కంటే వరుస పెట్టి సినిమాలు లైన్ లో పెడుతున్నారు. పాలిటిక్స్ నుండి సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం రెండు సినిమాలు చేసిన చిరంజీవి… ఇప్పుడు దాదాపు అరడజను సినిమాలు ఒప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29వ తారీకు సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఏప్రిల్ రెండో వారం నుండి స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే చిరంజీవి 154వ సినిమాకి సంబంధించి అనేక వార్తలు ఇటీవల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పాత పాటలు మాస్ మహారాజ రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయినట్లు ఇటీవలే వార్తలు వినటం జరిగింది. అంతేకాకుండా నివేత పేతురాజ్ హీరోయిన్ గా రవితేజ సరసన నటించడానికి తీసుకున్నట్లు కూడా టాక్ నడిచింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ చేయటానికి డైరెక్టర్ బాబీ రెడీ అయినట్లు సమాచారం.
మొదటి షెడ్యూల్ లో చిరంజీవి విలన్లతో ఫైటింగ్ సన్నివేశాలు షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. అప్పట్లో “అన్నయ్య” సినిమాలో ఆ తర్వాత “శంకర్ దాదా జిందాబాద్” సినిమా లో.. నటించిన రవితేజ చాలా కాలం తర్వాత మళ్లీ చిరంజీవి 150 నాలుగు సినిమాల్లో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “వాల్తేర్ వీరయ్య” అనే టైటిల్ పెట్టాలని సినిమా యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. శ్రీలంక బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సినిమా స్టోరీ ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ చేయనున్నట్లు తక్కువ టైంలోనే కంప్లీట్ చేసి విడుదల చేసే ఆలోచనలో చిరంజీవితో పాటు సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!