NewsOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న చిరంజీవి “వాల్తేరు వీరయ్య”..!!

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న “వాల్తేరు వీరయ్య” నిన్న సెన్సార్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. “వాల్తేరు వీరయ్య” సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ కేటాయించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ ప్రకటనలో తెలియజేయడం జరిగింది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా రఫాడించేస్తది అని చెప్పుకొచ్చింది. మాస్ ఎంటర్టయినర్ నేపథ్యంలో బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నారు. కేథరిన్ తెరిసా కూడా కీలకపాత్రలో కనిపిస్తుంది. జనవరి 13వ తారీకు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Chiranjeevi's Waltair Veerayya completes the censor
Waltair Veerayya completes the censor

ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచే రీతిలో ఉంది. ఊర మాస్ లుక్ లో చిరంజీవి కనిపిస్తున్నారు. సినిమాకి సంబంధించి విడుదలైన వీడియోలు మరియు పోస్టర్ లలో చిరంజీవి అత్యంత మాస్ తరహాలో కనిపిస్తూ ఉండటంతో… ఫ్యాన్స్ సినిమా చూడటానికి ఎంతో ఆతృతగా ఉన్నారు. పైగా “శంకర్ దాదా ఎంబిబిఎస్” వంటి ఫుల్ మిల్స్ ఎంటర్టైన్మెంట్ తర్వాత ఆ తరహా ఫ్లేవర్ “వాల్తేరు వీరయ్య” లో ఉంటుంది అని చిరంజీవి చెప్పటంతో… అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డైరెక్టర్ బాబీ సినిమాలో వీరయ్య క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చారు. వీరయ్య లేని సన్నివేశాలు సైతం రోమాలు నీక్కబడుచుకునేలా ఉంటాయని అన్నారు.

Chiranjeevi's Waltair Veerayya completes the censor
Chiranjeevi’s Waltair Veerayya

పైగా రవితేజ తో కలిసి చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో… మరింత ఇంట్రెస్ట్ ఏర్పడింది. ప్రధాన పాత్రలో చిరంజీవి కనిపించే సినిమా అయినా గాని ఇందులో దాదాపు అరగంటకు పైగానే రవితేజకి సంబంధించి సన్నివేశాలు ఉంటాయని సమాచారం. అప్పట్లో అన్నయ్య సినిమాలో చిరంజీవి ఇంకా రవితేజ కలిసి నటించారు. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు చిరంజీవితో రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు సమాచారం.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N