Trivikram Hyper Aadi: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో డైరెక్టర్ త్రివిక్రమ్ ఒకరు. తన పంచ్ డైలాగులతో పాటు అద్భుతమైన మాటలతో ప్రేక్షకుల హృదయాలలో మాటల మాంత్రికుడిగా చేరగని ముద్ర వేసుకున్నారు. ఇండస్ట్రీలో దాదాపు టాప్ మోస్ట్ హీరోలు అందరితో పని చేసిన దర్శకుడిగా పేరందిన త్రివిక్రమ్ ఇటీవల ధనుష్ నటించిన సార్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు రావడం జరిగింది. ఇక ఇదే వేడుకకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా వచ్చారు. “సార్” సినిమాలో ఓ కీలకమైన పాత్రలో హైపర్ ఆది నటించడం జరిగింది. ఈ వేడుకలు హైపర్ ఆది మాట్లాడుతూ “సార్” సినిమా ఒక ఫుల్ మెయిల్స్ లాంటిదని చెప్పుకొచ్చారు.
హీరో ధనుష్ తో కలిసి నటించిన తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు తన ఆల్ టైం ఫేవరేట్ దర్శకుడు త్రివిక్రమ్ గారే. ఒక రకంగా చెప్పాలంటే ఆయనే నాకు స్ఫూర్తి. ఓ డైరెక్టర్ తన సినిమాలో మాటలను మరియు పాటలను ఇంక ఫైట్లను పదే పదే చూసేలా చేస్తాడు. కానీ స్టేజ్ మీద స్పీచ్ లను కూడా పదేపదే చూసేలా చేసే ఏకైక దర్శకుడు త్రివిక్రమ్ గారు. ఒక దర్శకుడికి హీరో ఉన్నంత క్రేజ్ ఆయనకు ఉంది. ఆయన మాటలు మరియు ప్రవాహం అలాంటిది.
మాటలకే మనిషి రూపం వస్తే అది మాట్లాడే మొదటి మాట థాంక్యూ త్రివిక్రమ్ గారు. ప్రాసకి ఆశ కలిగితే అది చూడాలనుకునే మొదటి ఫేసు త్రివిక్రమ్. ఆయన తీసే ప్రతి సినిమాలను కుటుంబ విలువలు ఉంటాయి. తెల్ల పేపర్ కి న్యాయం చేయగలిగే ఏకైక రైటర్ త్రివిక్రమ్ గారు. ఆయనది భీమవరం ఆయన మన ఇండస్ట్రీకి లభించిన ఓ వరం అంటూ సార్ ఫ్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు త్రివిక్రంపై హైపర్ ఆది పొగడ్తలతో ముంచెత్తారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!