విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న చిత్రం `డియర్ కామ్రేడ్`. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్` అనేది ట్యాగ్ లైన్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దక్షిణాదిన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. శుక్రవారం (జూలై 12న) బెంగళూరులో ఈ సినిమా మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. దీనికి కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆడిటోరియం వేదికైంది. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్లతో ఈ మ్యూజిక్ ఫెస్టివల్లో హీరో విజయ్ దేవరకొండ అందరినీ ఆకట్టుకున్నారు. రష్మిక మందన్నా హీరో విజయ్ దేవరకొండతో స్టెప్పులేయడమే కాదు.. స్టేజ్‌పై పియానో కూడా ప్లే చేశారు. ముఖ్యంగా క్యాంటీన్ సాంగ్‌లో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. జస్టిన్ ప్రభాకర్ ఈ సాంగ్‌ను పెర్ఫామ్ చేశారు.
కన్నడ రాక్‌స్టార్ యశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంటైర్ యూనిట్‌ను అభినందించిన యశ్, కన్నడ ట్రైలర్‌ను విడుదల చేశారు. శనివారం(జూన్ 13న) కేరళ ముఖ్య పట్టణం కొచ్చిన్‌లోని కొల్లూర్.. గోకులం కన్వెన్షన్‌లో మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఇదే విధంగా ఈ నెల 18న చెన్నైలో.. 19న హైదరాబాద్ నగరాల్లో `డియర్ కామ్రేడ్` మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను నిర్వహించనున్నారు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!