Devatha Serial: ఆదిత్య స్కూల్ దగ్గర పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.. దేవి మాట్లాడకుండా లోపలికి వెళ్ళి పోతుంది.. ఏమ్మా చిన్మయి దేవి ఎందుకు అలా వెళ్ళిపోయింది సారీ అంకుల్ దేవి ఇంకెప్పుడూ మాట్లాడదు. వినాయకుడి మీద ఒట్టు వేసి అమ్మకు మాట ఇచ్చింది దేవి.. సారీ అంకుల్ ఉయ్ మిస్ యు అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య కోపంగా రుక్మిణి దగ్గరకు వెళతాడు.
చిన్న పిల్ల దేవి ని ఎందుకు అలా చేస్తున్నావు.. దేవి మీ బిడ్డే కాదు నా బిడ్డ కూడా.. నీ ప్రేమకు నన్ను దూరం చేసింది చాలదన్నట్టు నా బిడ్డకు కూడా నన్ను దూరం చేస్తావా.. తెలియక ముందే ఎలా ఉన్నారు ఎప్పుడు కూడా అలాగే ఉండండి బిడ్డ దగ్గరకు రాకండి అని ఆదిత్య వారిస్తుంది రాధ.. నా బిడ్డను నా నుంచి దూరం చేసే హక్కు తల్లిగా నీకు కూడా లేదు.. దేవి నీ బిడ్డని నేను చెప్పాలి.. కాదు అంటే ఏం చేస్తావ్ పెనిమిటి అని ఆదిత్య ప్రశ్నిస్తుంది.. నేను చేసింది తప్పా రైటా నాకు తెలీదు అందరినీ వద్దనుకుని మీకు దూరంగా వచ్చేశాను.. నేను లేనప్పుడు మీరు ఎలాగ ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. నన్ను నా బిడ్డను వదిలేయండి అని చెబుతుంది.
నీ చెల్లెలు కోసం నన్ను వదిలేసి వెళ్లిపోయారు నేను భరించాను ఇక భరించడం నావల్లకాదు.. నా బిడ్డను నా నుంచి దూరం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను.. నా బిడ్డ నాకు కావాలి.. నీకు నచ్చిన నీ బ్రతుకు కి నుంచి బిడ్డను ఎలా ఇస్తావో నీ ఇష్టం.. కుదరదు అంటే మాత్రం దేవి నా కూతురు అన్న నిజం ప్రపంచానికి చెప్పి నా బిడ్డను నేను తీసుకెళ్ళిపోతాను అని ఆదిత్య చెబుతాడు.. నా గురించి నువ్వు ఆలోచించినప్పుడు నా బిడ్డ కోసం నీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం నాకు ఉండదు కదా అని ఆదిత్య అక్కడనుంచి వెళ్ళి పోతాడు.. ఇక రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.