Prabhas: డార్లింగ్ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘రాధేశ్యామ్’ చిత్రంతో దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసినదే. ప్రభాస్ కి తాజాగా ఆపరేషన్ అయిన సంగతి తెలిసినదే. దాని వలన డాక్టర్లు 2 నెలల పాటు ప్రభాస్ ని విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ‘సలార్’ షూటింగ్ మరింత ఆలస్యం కానుందని తద్వారా రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ మూవీతో పాటు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సందీప్ వంగాతో చేయబోతున్న ‘స్పిరిట్’ చిత్రాలు కూడా మరింత ఆలస్యం కాబోతున్నాయని వినికిడి.
Prabhas: 3D ఫార్మాట్లో అత్యంత భారీ స్థాయిలో ‘ఆదిపురుష్’..
Prabhas: తాజా సమాచారం ఇదే:
ఇకపోతే, ప్రభాస్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ స్పెయిన్ వెళ్లడానికి ముందు డైరెక్టర్ కొరటాల శివతో మీటింగ్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొరటాల శివ హీరో ప్రభాస్ కు స్టోరీ కూడా వినిపించారట. స్టోరీ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు. ఈ మూవీని యువీ క్రియేషన్స్ నిర్మించే అవకాశం వుందని టాక్.
Koratala siva : భారీ స్కెచ్ వేసిన కొరటాల..ఎన్టీఆర్ – చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ మించిన పాన్ ఇండియన్ సినిమాలు..!
మరింత సమాచారం:
‘మిర్చి’ చిత్రంతో కొరటాల శివ డైరెక్టర్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మళ్లీ ప్రభాస్ తో కలిసి వర్క్ చేయాలని శివ అనుకున్నా కుదరలేదు. అది త్వరలోనే కార్యరూపం దాల్చబోతోందని డార్లింగ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నారు. సలార్ ప్రాజెక్ట్ కె చిత్రీకరణ దశలో వున్నాయి. సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సెట్స్ పైకి రావాల్సి వుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కాబోతుంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!